పనికి ఎంత సమయం కేటాయించాలనే దానిపై వివిధ సంస్థల అధినేతల మధ్య చర్చ సాగుతోంది.

పనికి ఎంత సమయం కేటాయించాలనే దానిపై వివిధ సంస్థల అధినేతల మధ్య చర్చ సాగుతోంది. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ప్రాముఖ్యత గురించి కూడా విస్తృతంగా చర్చనీయాంశమైంది. గత ఏడాది ఇన్ఫోసిస్‌కు చెందిన నారాయణ్‌మూర్తి ‘వారానికి 70 గంటలు పని’ అంటూ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది. ఇప్పుడు దీనిపై స్పందించిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒక ప్రకటన చేయడంతో రోజుకు 8 గంటలకు మించి పనిచేస్తే ఏం జరుగుతుందనే దానిపై వివిధ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. విజయాన్ని వెంటాడుతూ గంటల తరబడి ఆఫీసులో గడుపుతున్నారు. చాలా మందికి వారి కుటుంబాలపై దృష్టి పెట్టడానికి సమయం లేదు. ఇలా చేస్తే మీ వ్యక్తిగత జీవితానికి హాని కలుగుతుందని గౌతమ్ అదానీ అన్నారు. "నా అభిప్రాయం ప్రకారం, నేను వ్యక్తిగతంగా పని-జీవిత సమతుల్యతను అర్థం చేసుకుంటా, "ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కనీసం నాలుగు గంటలు గడపాలి, మీరు కార్యాలయంలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ గడిపినట్లయితే, మీ భార్య పారిపోతుంది' అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ehatv

ehatv

Next Story