గోవాలోని(Goa) ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న గౌరవ్‌ కతియార్(Gaurav Katiyar).. తన భార్య దీక్షా గాంగ్వార్‌ను(Deeksha Gangwar) చంపాలని ప్లాన్‌ వేసుకున్నాడు. అందుకు సముద్రాన్నిఎంచుకున్నాడు. బీచ్‌లో శికారుకు తీసుకెళ్లి ఎవరూ చూడడం లేదని భావించి ఆమెను సముద్రంలో తోసేశాడు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడరు అనుకున్నట్లే మనోడు కూడా అదే అనుకున్నాడు.

గోవాలోని(Goa) ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న గౌరవ్‌ కతియార్(Gaurav Katiyar).. తన భార్య దీక్షా గాంగ్వార్‌ను(Deeksha Gangwar) చంపాలని ప్లాన్‌ వేసుకున్నాడు. అందుకు సముద్రాన్నిఎంచుకున్నాడు. బీచ్‌లో శికారుకు తీసుకెళ్లి ఎవరూ చూడడం లేదని భావించి ఆమెను సముద్రంలో తోసేశాడు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడరు అనుకున్నట్లే మనోడు కూడా అదే అనుకున్నాడు. కానీ ఈ ఘటనను ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లక్నోకు(Lucknow) చెందిన గౌరవ్‌ కతియార్ దక్షిణ గోవాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. లక్నోకే చెందిన దీక్షా గాంగ్వార్‌ను ఏడాది కిందటే పెళ్లి చేసుకున్నాడు. గోవాలోనే ఈ జంట కాపురం పెట్టింది. ఈ క్రమంలో గౌరవ్‌కుమార్‌కు మరో మహిళతో వివాహేతర(Extra Marital Affair) సంబంధం ఉంది. ఈ విషయం భార్యకు తెలియడంతో పలుసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఎలాగైనా తన భార్యను అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. తను పనిచేసే హోటల్‌ దగ్గరలోనే కాబో డి రామా బీచ్‌కు(Kabodi Ram Beach) తీసుకెళ్లాడు. బీచ్‌లో రాళ్లు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను చితకబాది సముద్రంలో తోశాడు. దీక్ష ప్రమాదకరంగా చనిపోయిందని చిత్రీకరించాలనుకున్నాడు. పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఈ క్రమంలో పోలీసులకు ఓ వీడియో దొరికింది. బీచ్‌లో భార్యను గౌరవ్‌ కొట్టడం, సముద్రంలో తోసేసిన దృశ్యాలు ఆ వీడియోల లభ్యమయ్యాయి. దీక్షను తోసిన తర్వాత ఒడ్డుకు వచ్చిన గౌరవ్.. తను చనిపోయిందో లేదోనన్న అనుమానంతో మరోసారి ఘటనాస్థలికి వెళ్లి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లిపోయాడు. ఈ వ్యవహారమంతా సెల్‌ఫెన్‌ కంటికి చిక్కడంతో మనోడి బండారం బయటపడింది. దీంతో నిందితుడు గౌరవ్‌ను అరెస్ట్ చేసి కటకటాలకు పంపించారు పోలీసులు.

Updated On 21 Jan 2024 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story