బీహార్‌లోని(Bihar) అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్ గ్యాస్ డెలివరీ బాయ్(Gas Delivery Boy). స్థానికంగా ఉన్న ఓ గ్యాస్ ఏజెన్సీలో ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తాడు. ఈ యువకుడు ఫాంటసీ క్రికెట్ గేమ్‌లో(Fantasy Cricket Game) జాక్‌పాట్ కొట్టాడు.
బీహార్‌లోని(Bihar) అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్ గ్యాస్ డెలివరీ బాయ్(Gas Delivery Boy). స్థానికంగా ఉన్న ఓ గ్యాస్ ఏజెన్సీలో ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తాడు. ఈ యువకుడు ఫాంటసీ క్రికెట్ గేమ్‌లో(Fantasy Cricket Game) జాక్‌పాట్ కొట్టాడు. డ్రీమ్-11 యాప్‌లో(Dream 11) గేమ్ ఆడిన ఇతనికి రూ. కోటిన్నర గెలుచుకున్నాడు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న సాదిఖ్ ఈ నెల 14న జరిగిన భారత్(Bharath)-అఫ్గానిస్థాన్(afghanisthan) టీ20 మ్యాచ్(T20 Match) సందర్భంగా రూ.49 పెట్టి డ్రీమ్-11లో గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. దీంతో సాదిఖ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. సాదిఖ్ ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. దీనిపై గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర మాట్లాడుతూ సాదిఖ్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు.