సాధారణంగా గ్యాస్ బుక్‌ (Gas Book) చేసుకోవలనుకుంటే సబంధిత ఏజెన్సీ నెంబర్లకు ఫోన్‌ లేదా ఆయా వెబ్‌సైట్లలో బుక్‌ చేసుకుంటా. గ్యాస్‌ ఏజెన్సీల నెంబర్లకు ఫోన్‌ చేస్తే బుక్‌ చేసుకోవాలనుకున్నా, ఇతర సేవల కోసం ఆప్షన్స్ (Options) ఇస్తుంది. ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని గ్యాస్ ఆధారిత సేవలను పొందుతారు

సాధారణంగా గ్యాస్ బుక్‌ (Gas Book) చేసుకోవలనుకుంటే సబంధిత ఏజెన్సీ నెంబర్లకు ఫోన్‌ లేదా ఆయా వెబ్‌సైట్లలో బుక్‌ చేసుకుంటా. గ్యాస్‌ ఏజెన్సీల నెంబర్లకు ఫోన్‌ చేస్తే బుక్‌ చేసుకోవాలనుకున్నా, ఇతర సేవల కోసం ఆప్షన్స్ (Options) ఇస్తుంది. ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని గ్యాస్ ఆధారిత సేవలను పొందుతారు. కొందరు నేరుగా గ్యాస్‌ ఏజెన్సీల కార్యాలయాలకు వెళ్లి సిలిండర్‌ను బుక్‌ చేసుకుంటుంటారు. అయితే వాట్సాప్‌ (Whatsapp) ఈ అవకాశాన్ని వాడుకుంది. కొత్తకొత్త టెక్నాలజీలను పరిచయం చేసి వాట్సాప్‌.. దాని ద్వారా గ్యాస్ బుకింగ్ సేవలను ప్రారంభించింది.

అయితే, ఈ సేవలు ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా కూడా మనకు అందుతున్నాయి. గ్యాస్‌ బుక్‌ చేసుకోవలనుకుంటే ముందుగా మీరు.. మీ రిజిస్టర్డ్‌ ఫోన్లలో (Registered mobiles) ఆయా సంస్థల నెంబర్లను సేవ్‌ చేసుకోవాలి. హెచ్‌పీ (HP)- 9222201122, ఇండియన్‌(Inidan) -7588888824, భారత్‌ (Bharath)-1800224344 ఈ నెంబర్లను సెల్‌ఫోన్‌లో సేవ్‌ చేసుకొని.. వాటికి టెక్స్ట్‌ (Text) చేయాల్సి ఉంటుంది. Hi అని టైప్‌ చేసిన తర్వాత భాషను ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. భాషను (Language) ఎంచుకున్న తర్వాత గ్యాస్‌ బుకింగ్‌, అదనపు సిలిండర్‌కు ఆర్డర్.. ఫిర్యాదుల వంటి ఆప్షన్స్‌ మనకు డిస్‌ప్లే చేస్తుంది. మనకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకొని బుకింగ్‌ లేదా ఇతరత్రా సేవలు పొందే అవకాశాన్ని వాట్సాప్‌ కలిపిస్తోంది.

Updated On 8 Jan 2024 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story