ఇదో షాకింగ్‌ వీడియో! ఓ ప్రైవేటు విమానం(Private plane) కాక్‌పిట్‌లో తండ్రి బీరు(Beer) తాగుతున్నాడు. 11 ఏళ్ల కొడుకేమో ఆ విమానాన్ని కంట్రోల్‌ చేస్తున్నాడు. బీరు తాగుతూనే విమానాన్ని ఎలా నడపాలో ఆ తండ్రి కొడుకుకు వివరిస్తున్నాడు. విషాదమేమిటంటే ఆ తండ్రీకొడుకులిద్దరూ విమాన ప్రమాదంలో మరణించడం! ఇది జరిగింది బ్రెజిల్‌లో(Brazil)..

ఇదో షాకింగ్‌ వీడియో! ఓ ప్రైవేటు విమానం(Private plane) కాక్‌పిట్‌లో తండ్రి బీరు(Beer) తాగుతున్నాడు. 11 ఏళ్ల కొడుకేమో ఆ విమానాన్ని కంట్రోల్‌ చేస్తున్నాడు. బీరు తాగుతూనే విమానాన్ని ఎలా నడపాలో ఆ తండ్రి కొడుకుకు వివరిస్తున్నాడు. విషాదమేమిటంటే ఆ తండ్రీకొడుకులిద్దరూ విమాన ప్రమాదంలో మరణించడం! ఇది జరిగింది బ్రెజిల్‌లో(Brazil).. జులై 29వ తేదీన జరిగిన ప్రమాదంలో 42 ఏళ్ల గేరన్‌ మాయా(Geran Maya), అతడి కొడుకు ఫ్రాన్సిస్‌కో మాయా(Francisco Maya) ప్రాణాలు కోల్పోయారు. అడవిలో ఆ విమానం కుప్పకూలడంతో ఇద్దరూ చనిపోయారు. అయితే ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఆ వీడియో ఆ దర్ఘటన జరగడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిందా లేదా గతంలో ఎప్పుడో తీసిన వీడియోనా అన్న విషయం తేలలేదు. గేరన్‌ మాయా బీరు తాగుతున్న సమయంలో అతడి కొడుకు విమాన కంట్రోలింగ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. విమానాన్ని ఎలా న‌డ‌పాలో కుమారుడికి తండ్రి వివరిస్తున్నట్టుగా వీడియోలో ఉంది.

Updated On 9 Aug 2023 2:43 AM GMT
Ehatv

Ehatv

Next Story