అతడు కరుడుకట్టిన మాఫియా డాన్! గ్యాంగ్‌స్టర్...ఆ క్వాలిఫికేషన్‌తోనే రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)లో చేరారు. అయిదుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఫూల్‌పూర్ లోక్‌సభ నుంచి ఎంపీ కూడా అయ్యాడు. ములాయంసింగ్(Mulayam Singh )కుమారుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) మాత్రం అతడిని దూరం పెట్టాడు. అతడే ప్రస్తుతం మీడియాలో నానుతున్న అతిక్ అహ్మద్(Atique Ahmed).
అతడు కరుడుకట్టిన మాఫియా డాన్! గ్యాంగ్‌స్టర్...ఆ క్వాలిఫికేషన్‌తోనే రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)లో చేరారు. అయిదుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఫూల్‌పూర్ లోక్‌సభ నుంచి ఎంపీ కూడా అయ్యాడు. ములాయంసింగ్(Mulayam Singh )కుమారుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) మాత్రం అతడిని దూరం పెట్టాడు. అతడే ప్రస్తుతం మీడియాలో నానుతున్న అతిక్ అహ్మద్(Atique Ahmed). నిన్నటి వరకు అతగాడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయాగ్‌రాజ్ జైలుకు తరలిస్తున్నారు. ఇందుకోసం 45 మంది పోలీసుల బృందం సబర్మతి జైలుకు వెళ్లింది. జైల్లో ఊచలు ఎందుకు లెక్కిస్తున్నాడంటే 2005లో బహుజన్‌సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్‌పాల్, ఆయన ఇద్దరు భద్రతా సిబ్బందిని ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపాడు. ప్రయాగ్‌రాజ్ జైలుకు తరలించడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసు బృందం సబర్మతి జైలుకు చేరుకుంది.
అతిక్ అహ్మద్ రాజకీయ జీవితం 1989లో ప్రారంభమయ్యింది. అప్పుడు ఇండిపెండెంట్‌గా అలహాబాద్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించాడు. మరో రెండుసార్లు తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. ఆ తర్వాతే సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. 1996 ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి విజయం సాధించాడు. మూడేళ్ల తర్వాత సమాజ్‌వాదీ పార్టీని వదిలిపెట్టి అప్నాదళ్ పార్టీలో చేరాడు. 2002లో ఆ పార్టీ నుంచి విజయం సాధించాడు. ఏడాది తిరక్కుండానే మళ్లీ సమాజ్‌వాదీ పార్టీలోకి వచ్చేశాడు. 2004లో ఫూల్‌పూర్ లోక్‌సభ నుంచి విజయం సాధించాడు. ఒకప్పుడు ఈ స్థానం నుంచే మన మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విజయం సాధించారు. ఎక్కడ నెహ్రూ? ఎక్కడ అతిక్ అహ్మద్? రాజకీయాలు ఎలా భ్రష్టుపడ్డాయో చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ.
రాజ్‌పాల్ హత్య కేసు ఇతడి మెడకు చుట్టుకున్న తర్వాత రాజకీయం జీవితం మసకబారడం మొదలు పెట్టింది. అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌ను ఎన్నికల్లో రాజ్‌పాల్ ఓడించడంతో కక్షలు మొదలయ్యాయి. ఫూల్‌పూర్ లోక్‌సభకు ఎన్నికైన తర్వాత అతిక్ అహ్మద్ అలహాబాద్ పశ్చిమ అసెంబ్లీకి రాజీనామా చేశాడు. దాంతో 2005లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో అతిక్ సోదరుడు అష్రఫ్‌ను రాజ్‌పాల్ ఓడించారు. ఈ ఓటమిని అతిక్ తట్టుకోలేకపోయాడు. 2005, జనవరి 25న హాస్పిటల్ నుంచి తన సహచులు సందీప్ యాదవ్, దేవిలాల్‌లతో కలిసి వస్తున్న రాజ్‌పాల్‌ను కాల్చి చంపాడు అతిక్ అహ్మద్. రాజుపాల్ భార్య అతిక్ అహ్మద్, అష్రఫ్, గుర్తు తెలియని మరో ఏడుగురిపై పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. చాన్నాళ్ల పాటు రాజకీయ పలుకుబడితో తప్పించుకుని తిరిగిన అతిక్ 2008లో పోలీసులకు లొంగిపోయాడు. విచిత్రమేమిటంటే 2012లో చక్కగా విడుదలయ్యాడు. విడుదలవ్వడమే కాదు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ కూడా చేశాడు. ప్రజల అదృష్టం కొద్దీ అతడు ఓడిపోయాడు. ఇతడి నేరచరిత్రను తెలుసుకున్న అఖిలేష్ పార్టీ నుంచి వెలివేశారు. 2017 ఫిబ్రవరిలో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు.
ప్రయాగ్‌రాజ్‌లోని సాబ్ హిగ్గిన్‌బాటమ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టాఫ్‌ను దుర్భాషలాడటం, వారిని వేధించడం ఈ అరెస్ట్‌కు కారణం. 2019లో జైల్లోనుంచే వారణాసి లోక్‌సభ నుంచి నరేంద్రమోదీపై పోటీకి దిగారు. 855 ఓట్లను సంపాదించుకున్నాడు. 60 ఏళ్ల అతిక్ అహ్మద్‌పై 70కి పైగా కేసులున్నాయి. హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ ఇంకా చాలా చాలా కేసులున్నాయి. ఉమేశ్‌పాల్‌ను హత్య చేయడానికి ముందు ఆయనను కిడ్నాప్ చేసి బెదిరించాడు కూడా!
ఇంతకు ముందు కూడా అతిక్‌పై పలు కిడ్నాప్ కేసులున్నాయి. ఇందులో ఓ కిడ్నాప్ కేసుకు సంబంధించి అతిక్‌ను మార్చి 28న కోర్టు ముందు హాజరుపర్చాలని, అదే రోజు తీర్పు వెలువరించనున్నట్టు ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు. అతిక్ మాత్రం తన ప్రాణాలకు హాని ఉందంటున్నాడు. ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువెళుతూ మధ్యలోనే తనను ఎన్‌కౌంటర్ చేస్తాడరేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి హాజరు కావల్సి ఉండగా అతిక్ మాత్రం ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫర్సెన్స్ ద్వారా ఖరారు చేయండి అని వేడుకుంటున్నాడు. వాస్తవానికి ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్‌కు మార్చి 28న కోర్టులో శిక్ష ఖరారు కానుంది. ఇదే కేసులో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి ఈ నెల మొదట్లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అతిక్ భయానికి ఇదే ప్రధాన కారణం.