పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) సందేశ్‌ఖాలీ(Sandheshkkali) ఘటన బీజేపీ(BJP) సృష్టేనని తెలిసిపోవడంతో ఆ పార్టీ మింగలేకా కక్కలేకా సతమవుతోంది. దేశాన్ని కుదిపేసిన ఈ సంఘటనకు సంబంధించి అధికార తృణమూల్ కాంగ్రెస్‌(Trinamool Congress) వారం రోజులుగా విడుదల చేస్తున్న వీడియోలతో బీజేపీ బిక్కచచ్చిపోతున్నది. లేటెస్ట్‌గా మరో వీడియోను విడుదల చేసింది టీఎంసీ.

పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) సందేశ్‌ఖాలీ(Sandheshkkali) ఘటన బీజేపీ(BJP) సృష్టేనని తెలిసిపోవడంతో ఆ పార్టీ మింగలేకా కక్కలేకా సతమవుతోంది. దేశాన్ని కుదిపేసిన ఈ సంఘటనకు సంబంధించి అధికార తృణమూల్ కాంగ్రెస్‌(Trinamool Congress) వారం రోజులుగా విడుదల చేస్తున్న వీడియోలతో బీజేపీ బిక్కచచ్చిపోతున్నది. లేటెస్ట్‌గా మరో వీడియోను విడుదల చేసింది టీఎంసీ. ఇందులో బీజేపీ సందేశ్‌ఖాలీ మండలాధ్యక్షుడు గంగాధర్‌ కయాల్‌(Gangadhar Koyal) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అందులో ఆయన ఏమన్నారంటే లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ స్థానిక నేత సత్రాప్‌ షాజహాన్‌ షేక్‌, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న 70 మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. 30శాతం మంది మహిళలు ఉండే 50 బూత్‌లలో పంపిణీ చేసేందుకు తమకు రెండున్న లక్షల రూపాయలు అవసరమయ్యాయని గంగాధర్‌ కయాల్ తెలిపారు. ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంతృప్తికరంగా డబ్బులు ఇచ్చి ఆందోళనలో ముందు ఉంచి పోలీసులతో తలపడేలా చేయాలని గంగాధర్‌ చెప్పడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సందేశ్‌ఖాలీ ఉదంతంలో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ కుట్ర ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక మహిళలను బలిపశువులను చేస్తూ క్రిమినల్‌ కుట్రకు పాల్పడిన రేఖాశర్మ, బీజేపీ నేత పియాలీ దాస్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి టీఎంసీ ఫిర్యాదు చేసింది. వారు ఫోర్జరీ, మోసం, దగా, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చెప్పింది.

Updated On 13 May 2024 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story