ఆన్‌లైన్‌ ద్వారా పిల్లల మనసులను కలుషితం చేసి తద్వారా మత మార్పిడి చేయిస్తున్న ఓ ముఠాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు. పిల్లలను తమ మతం మార్చుకోవడానికి వారిని ప్రలోభపెట్టడానికి ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నదా ముఠా. ఈ విధంగా మతం మారిన నలుగురు మైనర్లను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇద్దరు ఘజియాబాద్‌కు చెందిన వారు కాగా, ఫరీదాబాద్‌, చండీగఢ్‌లలో ఒక్కొక్కరు ఉన్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా పిల్లల మనసులను కలుషితం చేసి తద్వారా మత మార్పిడి చేయిస్తున్న ఓ ముఠాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు. పిల్లలను తమ మతం మార్చుకోవడానికి వారిని ప్రలోభపెట్టడానికి ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నదా ముఠా. ఈ విధంగా మతం మారిన నలుగురు మైనర్లను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇద్దరు ఘజియాబాద్‌కు చెందిన వారు కాగా, ఫరీదాబాద్‌, చండీగఢ్‌లలో ఒక్కొక్కరు ఉన్నారు. ఈ ముఠా ఎవరినైతే ఇస్లాం మతంలోకి మార్చాలనుకుంటుందో వారినే టార్గెట్‌ చేస్తుంది. మొదట వారిని ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ ద్వారా వల వేస్తుంది. టీనేజ్‌ పిల్లలను ఆన్‌లైన్‌లోనే మచ్చిక చేసుకుంటారు ముఠా సభ్యులు. తర్వాత వారికి ఇస్లామ్ మత ప్రచారకుడు జాకీర్‌ నాయక్‌ వంటి వారు మతం గురించి మాట్లాడిన వీడియోలను చాటింగ్‌ యాప్‌ ద్వారా చూపిస్తారు. వారి మైండ్‌ను మారుస్తారు. వారిని ఓ రకమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి మత మార్పిడి చేస్తారు. ఇలా టీనేజ్‌ పిల్లలను మతం మారేలా చేస్తున్నారన్న సమాచారం ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు అందింది. వెంటనే వారు రంగంలోకి దిగారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ ఫోర్ట్‌నైట్‌ యాప్‌ ద్వారా టీనేజ్‌ బాలురను ఆకట్టుకుని, తర్వాత వారిని మత మార్పిడి చేయించేవాడు.eha

మహారాష్ట్రలోని థానేకు చెందిన మరో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోగలిగాడు. ఇప్పుడతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అసలు ఈ ముఠాకు నాయకుడు షా నవాజ్‌ ఖాన్‌. ఇతడి డిజిటల్‌ పేరు బ్యాడ్డో.. ఇతడేం చేస్తాడంటే ఫోర్ట్‌నైట్‌ గేమ్‌ ఆడే పిల్లలను గుర్తిస్తాడు. గేమ్‌ ఓడిపోయిన టీనేజ్‌ పిల్లలను ఎంపిక చేసుకుంటాడు. గేమ్‌ గెలవాలంటే ఖురాన్‌లోని కొన్ని పద్యాలు చదివితే చాలని వారికి చెప్పేవాడు. పాపం ఇతడి మాటలు నమ్మి కొందరు ఖురాన్‌ పద్యాలు చదివేవారు. అదృష్టం కొద్ది వారు గేమ్‌ గెలిస్తే అంతా ఖురాన్‌ మహిమేనని వారి మనసులో నూరిపోసేవాడు. ఇలా వారికి ఖురాన్‌ పట్ల నమ్మకం పెంచేవాడు. ఆ తర్వాత వారిని ఉచ్చులోకి లాగేవాడు. ఇస్లాం మతంలోకి మార్చేవాడు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి కలిగించే మరిన్ని అంశాలు తెలిశాయి. చాటింగ్‌ ఇంజిన్‌ ద్వారా ఇక్కడే కాకుండా యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన టీనేజర్లకు కూడా గాలం వేస్తున్నారట ఈ ముఠా సభ్యులు. దీన్ని బట్టి చూస్తే వీరికి అంతర్జాతీయంగా కూడా సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇస్లాం మతంలోకి మారిన పిల్లలు నిజానికి క్రిస్టియన్లు. తర్వాతే వారు ఇస్లాం మతంలోకి మారారు.

Updated On 6 Jun 2023 11:44 PM GMT
Ehatv

Ehatv

Next Story