బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వన్య ప్రాణులను పట్టుబడ్డాయి. వన్య ప్రాణులను తరలిస్తున్న ముఠా వ్యవహారాన్ని కస్టమ్స్ అధికారులు గుట్టురట్టు చేశారు.
బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(Bangalore International Airport)లో భారీగా వన్య ప్రాణుల(Wild Animals)ను పట్టుబడ్డాయి. వన్య ప్రాణులను తరలిస్తున్న ముఠా వ్యవహారాన్ని కస్టమ్స్ అధికారులు(Customs officials) గుట్టురట్టు చేశారు. గ్యాంగ్(Gang) సభ్యులు ఏకంగా 234 వన్య ప్రాణులను తరలించే యత్నం చేశారు. రెండు ట్రాలీ బ్యాగుల నిండా వన్య ప్రాణులు ఉన్నట్లుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ట్రాలీ బ్యాగులను తెరిచిచూడటంతో వాటి నిండా విషపూరితమైన పాములు, మొసలులు, ఊసరవెల్లులలతో పాటు అరుదైన జాతికి చెందిన తాబేలులు దర్శనమివ్వడంతో అధికారులు ఖంగుతిన్నారు. అయితే ఈ తరలింపు ప్రక్రియలో ఓ డబ్బాలో ఉంచిన కంగారు మృతి చెందింది. ఇందుకు సంబంధించి ఇద్దరు బ్యాంకాక్(Bangkok) ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వన్య ప్రాణుల చట్టం(Wildlife Act) కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.