ఓ వ్యక్తి అతి నీచానికి దిగాడు. భార్య(Wife), కన్న కూతురు(Daughter) పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఎలుక ఉంటే ఇళ్లంతా తగలబెట్టుకున్నట్లు చిన్నచిన్న కుటుంబ సమస్యలుంటే కుటుంబాన్నే పాముతో కాటు వేయించి చంపించాడో ఓ దుర్మార్గుడు. ఒడిశాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి ప్రకారం..

ఒడిశా(Odisha) రాష్ట్రం గంజయ్ జిల్లా(Ganja District) కబీసూర్యనగర్ పీఎస్ పరిధిలోని అధేగావ్ గ్రామవాసి గణేష్(Ganesh) (25)కు బసంతి(Basanti) (23) అనే మహిళతో 2020లో వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు దేవస్మిత(Devasmitha) ఉంది. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వస్తున్నాయి. తరుచుగా ఈ జంట మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కుటుంబాన్నే కాటేయాలనుకున్నాడు.. ఇందుకోసం నీచమైన ఆలోచనకు దిగాడు. గత అక్టోబర్ 6న పాముల ఎదుట ఊదుతూ జీవనం సాగించే ఓ వ్యక్తి నుంచి విషపూరితమైన పామును ఓ డబ్బాలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. భార్య, కూతురు నిద్రిస్తున్న గదిలోని మంచం వద్ద పామును వదిలిపెట్టాడు. తెలివిగా మరో గదిలో నిద్రపోయాడు గణేష్. తెల్లారేసరికి పాముకాటుతో భార్య, కూతురు విగతజీవులుగా మంచంపై పడి ఉన్నారు. పాము కాటుతో తన భార్య, కూతురు చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గణేష్ చెప్పిందే నిజమనుకున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను అప్పగించారు. ఏమీ తెలియనట్లు స్వేచ్ఛగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే తన కూతురు, మనవరాలిని అల్లుడే హత్య చేశాడని బసంతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరుచుగా గొడవపడేవారని పోలీసులకు తెలపడంతో గణేష్‌ను దాదాపు నెల తర్వాత అరెస్ట చేసి విచారించారు. తొలుత బుకాయించిన గణేష్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా పామును తనంతట తానే గదిలో వదిలేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో గణేష్ బండారం బట్టబయలైంది. చిన్నచిన్న తగదాలతో భార్యను, రెండేళ్ల చిన్నారిని చంపిన గణేష్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.