✕
భాద్రపదం(Bhadrapadam) వచ్చేసింది. ఈ మాసంలో జరిగే అతి పెద్ద పండుగ వినాయకచవితి(Vinayaka Chathurthi). సకల విఘ్నాలకు ఆయన అధిపతిగా, సమస్త గణాలకు అధినేతగా ప్రథమ పూజలందుకున్నాడు వినాయకుడు. ఏ పూజ అయినా విఘ్నేశ్వరుడి ధ్యానంతోనే మొదలవుతుంది. ముక్కోటి దేవతలలో మొదటి పీట ఏకదంతుడిదే..! లోకమంతా పూజలందుకుంటున్న లోకనాయకుడు ఆయన!

x
Madhur Mahaganapathi Temple
-
- భాద్రపదం(Bhadrapadam) వచ్చేసింది. ఈ మాసంలో జరిగే అతి పెద్ద పండుగ వినాయకచవితి(Vinayaka Chathurthi). సకల విఘ్నాలకు ఆయన అధిపతిగా, సమస్త గణాలకు అధినేతగా ప్రథమ పూజలందుకున్నాడు వినాయకుడు. ఏ పూజ అయినా విఘ్నేశ్వరుడి ధ్యానంతోనే మొదలవుతుంది. ముక్కోటి దేవతలలో మొదటి పీట ఏకదంతుడిదే..! లోకమంతా పూజలందుకుంటున్న లోకనాయకుడు ఆయన! ఈ సందర్భంగా ఆ గణనాథుడి సుప్రసిద్ధ ఆలయాల విశిష్టతలను తెలుసుకుందాం!
-
- ప్రపంచమంతా కొలుచుకునే వినాయకుడికి ఆలయాలు అంతటా ఉన్నాయి. వాటిల్లో గొప్పవి, అద్భుతమైనవి, ప్రాచీనమైనవి అనేకం..! మనదేశంలో లెక్కకు మించిన గుళ్లు ఉన్నాయి. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి.కోరినవన్నీ ఇస్తాడు కాబట్టే వినాయకుడికి అన్నేసి ఆలయాలు! గాడ్ ఓన్స్ కంట్రీగా(God Owns country) పేరొందిన కేరళలో ఆలయాలన్ని అద్భుతంగానే ఉంటాయి.
-
- ప్రకృతి ఒడిలో అలరారుతుంటాయి. అలాంటిదే కాసర్గోడ్ జిల్లా(Kasargod District) కేంద్రమైన కాసర్గోడ్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న మధుర్ మహాగణపతి ఆలయం(Madhur Mahaganapathi Temple)! పేరుకు మహాగణపతి ఆలయమే అయినా ఇందులోని మూలవిరాట్టు మాత్రం పరమశివుడు. ఆ శివలింగం(Shivalingam) కూడా స్వయంభు అని చెబుతారు. కొన్ని వందల ఏళ్ల కిందట మధుర(Madhura) అనే మహిళ ఈ శివలింగాన్ని కనుగొనింది కాబట్టే ఆలయానికి మధుర్ మహాగణపతి అన్న పేరు వచ్చింది.. మరి వినాయకుడు ఎలా వచ్చాడన్న సందేహం వచ్చే ఉంటుంది.
-
- ఒకరోజు ఆలయ పూజారి కొడుకు ఆడుకుంటూ ఆడుకుంటూ గర్భగుడికి చేరుకున్నాడు. అక్కడ దక్షిణంవైపు ఉన్న గోడమీద సరదాగా వినాయకుడి రూపాన్ని చెక్కాడు. ఆ పిల్లవాడి ముచ్చట తీర్చాలనుకున్నాడో లేక తండ్రి దగ్గరే తనుకూడా ఉండాలనుకున్నాడో ఏమోగానీ గోడమీద బొమ్మ కాస్తా వినాయకుడి విగ్రహంగా రూపుదిద్దుకున్నదట! అలా ఆవిర్భవించిన విగ్రహం నానాటికి పెరుగుతోందట! అలాగని భక్తులు చెబుతుంటారు.. ఇక్కడ వెలసినవినాయకుడిన బొడ్డగణపతి(Boddaganapati) అని పిలుచుకుంటున్నారు.
-
- మధుర్ మహాగణపతి ఆలయం మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలను గజప్రిస్త గోపురాలని అంటారు. ఎందుకలా అంటే ఏనుగు వెనుక భాగంలా ఈ గోపురాలు కనిపిస్తాయి కాబట్టి! ఆలయంలో రామాయణ(Ramayanam), మహాభారత(Mahabharatham) ఘట్టాలను శిల్పాల రూపంలో మలిచారు! అవి కూడా దారువుపైన! వినాయకుడంటేనే విఘ్నాలను తొలగించే దేవుడు! అందుకే ఏదైనా కొత్త కార్యాన్ని తలపెట్టినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు.
-
- ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడమని విఘ్ననాథుడిని వేడుకుంటారు. అప్పాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు. గణనాథుడికి ఇష్టమైన అప్పాలను నివేదించుకుంటే ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతుందట! సహస్రాప్పం నివేదన కూడా ఇక్కడ ఆచారంగా ఉందట! కర్ణాటకకు సరిహద్దులో ఉన్న ఈ ఆలయానికి కన్నడిగులు ఎక్కువగా వస్తుంటారు
..

Ehatv
Next Story