బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ గట్టి షాక్ ఇచ్చారు. నేడు ఆయన ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.
బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR)కు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్(Giridhar Gamang) గట్టి షాక్ ఇచ్చారు. నేడు ఆయన ఖర్గే(Mallikarjuna Kharge) సమక్షంలో కాంగ్రెస్(Congress)లో చేరనున్నారు. ఏడాది క్రితం గిరిధర్ గమాంగ్ చంద్రశేఖర్ రావు(Chandrashekar Rao) నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌లో చేరారు. గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆయన భార్య హేమ(Hema), కుమారుడు శిశిర్(Shishir) బుధవారం న్యూఢిల్లీలో తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారు. గమాంగ్ కుటుంబం 2015లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బిజెపి(BJP)లో చేరింది. ఆ తర్వాత బీజేపీని విడిచిపెట్టిన కొద్ది రోజుల తర్వాత జనవరి 2023లో భారత రాష్ట్ర సమితి(Bharatha Rastra Samithi)లో చేరారు.
ఆగష్టులోనే కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారనే వార్తలు రాగా.. గమాంగ్ కుటుంబం పెట్టిన కొన్ని షరతుల వల్ల చేరిక ఆలస్యమైంది. రాయగడ జిల్లాలోని గుణుపూర్ అసెంబ్లీ స్థానం లేదా కోరాపుట్ లేదా నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానానికి టిక్కెట్లు అభ్యర్థించడం వల్ల ఆలస్యమైందని కాంగ్రెస్ అంతర్గత సమాచారం. 2019లో బీజేడీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సప్తగిరి శంకర్ ఉలక.. కోరాపుట్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవడంతో ఇక్కడ చిక్కు తలెత్తింది. ఉలక కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించడం వలన ప్రస్తుత చేరికలకు పార్టీ వెనుకాడింది.. ఇది ఆలస్యానికి దారితీసింది" అని కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారు. ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఒడిశా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అజోయ్ కుమార్‌తో గమాంగ్ కుటుంబం చర్చలు జరిపింది. అందులో భాగంగానే నేడు ఖర్గే సమక్షంలో గమాంగ్ మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.