ఆ ఊళ్లో ఎక్కడికి వెళ్లినా సైనికులే కనిపిస్తారు.

ఆ ఊళ్లో ఎక్కడికి వెళ్లినా సైనికులే కనిపిస్తారు. దేశం కోసం ప్రాణాలొడ్డడానికి కూడా సిద్ధపడే దేశభక్తులే అగుపిస్తారు. ఆ ఊర్లో ప్రస్తుతం 35 మంది కర్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) గాజీపూర్‌లో(Ghazipur) ఉన్న గహ్మర్‌ గ్రామం(Gahmar Village) గురించే చెబుతున్నది. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా చరిత్ర సృష్టించిందా నగరం. ఇక్కడి యువతకు భారత సైన్యంలో చేరడమే ఏకైక లక్ష్యం. ఆ గ్రామ యువతీ యువకులకు 15 వేల మందికి పైగా రిటైర్డ్‌ జవాన్లే(Jawan) స్ఫూర్తి. మార్గదర్శులు కూడా! కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా, అత్యధిక సంఖ్యలో జవాన్లను పంపిన గ్రామంగా గహ్మర్‌ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన అయిదు వేల మంది సైన్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు.. గ్రామాన్ని 22 ప్రాంతాలుగా విభజించారు. ప్రతి ఒక్క ప్రాంతానికి ఓ జవాన్‌ పేరు పెట్టారు. ఆర్మీలో ఎంపికయ్యేందుకు, ఊళ్లో ఉన్న యువత అంతా తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి వ్యాయామం చేస్తారు. వీరి ట్రైనింగ్‌ కోసం గ్రామంలోని రిటైర్డ్‌ జవాన్లు 1,600 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. .

Eha Tv

Eha Tv

Next Story