కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించి నాలుగు రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీలోని ఇద్దరు దిగ్గజాలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మైండ్‌గేమ్ హైకమాండ్ ను గందరగోళంలో పడేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో మంగళవారం రోజంతా జరిగిన నేతల సమావేశాలు.. అసంపూర్తిగా ముగియడంతో మళ్లీ బుధవారం సమావేశమవనున్నట్లు తెలుస్తోంది.

G Parameshwara throws hat in the ring as Karnataka CM race hots up
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) స్పష్టమైన మెజారిటీ సాధించి నాలుగు రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీలోని ఇద్దరు దిగ్గజాలు సిద్ధరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్(DK Shivakumar)ల మైండ్‌గేమ్ హైకమాండ్ ను గందరగోళంలో పడేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) నివాసంలో మంగళవారం రోజంతా జరిగిన నేతల సమావేశాలు.. అసంపూర్తిగా ముగియడంతో మళ్లీ బుధవారం సమావేశమవనున్నట్లు తెలుస్తోంది.
కడుపు నొప్పి అంటూ సోమవారం ఢిల్లీకి రాని శివకుమార్ మంగళవారం ఉదయం రాజధానికి చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు ఖర్గేతో జరిగిన సమావేశంలో ఆయన సీఎంగా సిద్ధరామయ్య పేరును తిరస్కరించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి లేదా సీఎం పదవిని పంచుకుంటామని వచ్చిన ఆఫర్లను కూడా తిరస్కరించారు.సీఎం పదవికి తనకు తాను సహజ హక్కుదారునని ఆయన అభివర్ణించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లేకుంటే సాధారణ ఎమ్మెల్యేగానే ఉండాలనుకుంటున్నాను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఖర్గేతో భేటీ తర్వాత శివకుమార్ మీడియాతో మాట్లాడలేదు. కానీ.. ఢిల్లీకి బయలుదేరే ముందు బెంగళూరులో మాట్లాడుతూ.. ‘పార్టీ నా తల్లి, తల్లి తన కుమారుడికి అన్నీ ఇస్తుంది. పార్టీ కోరుకుంటే ఆ బాధ్యత నాకు ఇవ్వొచ్చు. మాది ఉమ్మడి కుటుంబం, ఎవరినీ విభజించడం నాకు ఇష్టం లేదు. నేను బాధ్యతాయుతమైన వ్యక్తిని. పార్టీ నిర్ణయం ఏదైనా సరే, నేను వెన్నుపోటు పొడవను, బ్లాక్‌మెయిల్ చేయను, పార్టీని వీడను. నేను పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఏ ఛానెల్ అయినా రిపోర్టు చేస్తే.. దానిపై పరువు నష్టం కేసు పెడతాను. నేను రాజీనామా చేస్తానని, లేదని కొందరు రిపోర్టు చేస్తున్నారు. పార్టీ నా తల్లి. నాకు హైకమాండ్ ఉంది, నా పార్టీ ఉంది, మాకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శివకుమార్ వ్యాఖ్యానించారు.
సాయంత్రం శివకుమార్ ఖర్గే నివాసం నుంచి బయలుదేరిన వెంటనే సిద్ధరామయ్య అక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు ఖర్గేతో చర్చించారు. అంతకుముందు కూడా సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్ర(Yathindra Siddaramaiah) తో కలిసి ఖర్గేను కలిశారు. ఆయన వెంట కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాహుల్(Rahul Gandhi) కూడా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఇద్దరూ దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు.
మూడో అభ్యర్థి కూడా సీఎం రేసులో నిలిచారు. సీనియర్ దళిత నాయకుడు జి.పరమేశ్వర(Parameshwara) మాట్లాడుతూ.. హైకమాండ్ కోరుకుంటే నేను బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర అన్నారు. పార్టీకి నేను చేసిన సేవల గురించి హైకమాండ్(High Commond)కు తెలుసు. నేను 50 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగలను, కానీ క్రమశిక్షణ కలిగిన సైనికుడిని కాబట్టి నేను అలా చేయను అని వ్యాఖ్యానించారు.
కొత్త సీఎం విషయమై బుధవారం ఉదయం మరోసారి సమావేశం కానున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలిపారు. ఈ భేటీలో సోనియా గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. శివకుమార్‌తో సోనియా(Soniya Gandhi) భేటీ కూడా జరిగే అవకాశం ఉంది. సోనియా ప్రతిపాదనకు డీకే అంగీకరించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. మరోవైపు కర్ణాటక విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా(Pawan Khera) తెలిపారు.
