మన దేశంలో రాజకీయ పార్టీలకు లెక్కే లేదు. చాలా మట్టుకు గుర్తింపు లేని పార్టీలే! రాజకీయపార్టీలు పెట్టుకోవడం పెద్దకష్టమైన పనేమీ కాదు. వంద మంది కూడి పది వేల రూపాయల డిపాజిట్‌ కడితే చాలు పార్టీ పెట్టేసుకోవచ్చు. పార్టీ పెట్టడం ఈజీనే కానీ, దానికి పేరు పెట్టడం మాత్రం చాలా కష్టం. పార్టీ పేరు కులాన్నో, మతాన్నో, వర్గాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా ఉండకూడదంతే! మన దేశంలో ఆరు జాతీయ పార్టీలున్నాయి.

మన దేశంలో రాజకీయ పార్టీలకు లెక్కే లేదు. చాలా మట్టుకు గుర్తింపు లేని పార్టీలే! రాజకీయపార్టీలు పెట్టుకోవడం పెద్దకష్టమైన పనేమీ కాదు. వంద మంది కూడి పది వేల రూపాయల డిపాజిట్‌ కడితే చాలు పార్టీ పెట్టేసుకోవచ్చు. పార్టీ పెట్టడం ఈజీనే కానీ, దానికి పేరు పెట్టడం మాత్రం చాలా కష్టం. పార్టీ పేరు కులాన్నో, మతాన్నో, వర్గాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా ఉండకూడదంతే! మన దేశంలో ఆరు జాతీయ పార్టీలున్నాయి. 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వీటి పేర్లు మనం తరచూ వింటూనే ఉంటాం! ఇక 2, 597 గుర్తింపు లేని రాజకీయపార్టీలు కూడా ఉన్నాయి. వీటిల్లో వినడానికి గమ్మత్తుగాను, చిత్రంగాను, ఆసక్తికరంగాను పేర్లు ఉన్న పార్టీలు చాలానే ఉన్నాయి. ట్వంటీ 20, హైటెక్‌, సాఫ్‌, సూపర్‌ నేషన్‌, జాగ్తే రహో వంటి పేర్లతో రాజకీయపార్టీలు ఉన్నాయంటే నమ్ముతారా? ఉన్నాయి కాబట్టి నమ్మి తీరాలి. ఇవే కాదు, ఇండియన్‌ లవర్స్‌ పార్టీ(Indian Lovers Party), ఇండియన్‌ ఓషియానిక్‌ పార్టీ, లైఫ్‌ పీస్‌ఫుల్ పార్టీ(Life Peacefull party), హోలీ బ్లెస్సింగ్‌ పీపుల్స్‌ పార్టీ(Holy peoples Blessings Party), లేబర్‌ అండ్‌ జాబ్‌ సీకర్స్‌ పార్టీ(Labor and Job Seekers Party), అఖిల భారతీయ భారత్‌మాతా-పుత్రపక్ష (పేరు చిత్రంగా ఉంది కదూ), భారతీయ మొహబ్బత్‌ పార్టీ(Indian Mohabbat Party), మినిస్టిరియల్‌ సిస్టం అబాలిషన్‌ పార్టీ, ఆల్‌ పెన్షనర్స్‌ పార్టీ(All Pensioners Party), తమిళ్‌ తెలుగు నేషనల్ పార్టీ(Tamil telugu national party), ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్‌ ఫస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, ఛాలెంజర్స్‌ పార్టీ(Challengers Party), స్వచ్ఛ భారత్‌ పార్టీ, సత్యయుగ్‌ పార్టీ, ఇన్సానియత్‌ పార్టీ, నేషనల్ టైగర్‌ పార్టీ, మర్యాదీదళ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు స్పేస్‌ సరిపోదు! ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నట్టుగానే గరీబ్‌ ఆద్మీ పార్టీ కూడా ఉంది. నారీశక్తి పేరుతో కూడా ఓ పార్టీ ఉంది. పేరుకు పెద్దదైన పార్టీ కూడా ఉంది. దాని పేరు ద రిలిజియన్‌ ఆఫ్‌ మ్యాన్‌ రివాల్వింగ్‌ పొలిటికల్ పార్టీ ఆఫ్‌ ఇండియా..ఉత్తరప్రదేశ్‌లో ఓ పార్టీ ఉండేది. దాని పేరు ఇస్లామిక్‌ డెమోక్రటిక్‌ పార్టీ. ఈ పేరు మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు వచ్చాయి. దాంతో పార్టీ పేరును సబ్‌ సే అచ్చీగా మార్చారు. చాలా మంది రైట్‌ టు రీకాల్‌ హక్కు ఉంటే బాగుంటుందని అనుకుంటుంటారు. అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు అన్నమాట! మనదేశంలో లేదు కానీ చాలా దేశాలలో ఇలాంటి హక్కు ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్‌ సూరీ అనే 42 ఏళ్ల కంప్యూటర్‌ ఆపరేటర్‌ రైట్‌ టు రీకాల్‌ పేరుతో ఓ పార్టీ పెట్టారు. గాలి కబుర్లు చెప్పి పదవిలోకి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఎన్నికలకు ముందు బోల్డన్నీ హామీలు ఇస్తారు. గెలిచిన తర్వాత ఏ ఒక్కటి నెరవేర్చరు. అలాంటి వారిని రీకాల్‌ చేసే హక్కు ప్రజలకు ఉండాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికే తాను పార్టీని పెట్టానని రాకేశ్‌ సూరీ అంటున్నారు. గజియాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే ఆప్‌ కీ అప్పీ పార్టీ, సుభాష్‌ వాదీ భారతీయ సమాజ్‌వాదీ పార్టీలు కూడా ఉన్నాయి.

Updated On 12 April 2024 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story