మాకొద్దీ హిందీ అంటూ ద్రవిడ రాష్ట్రాలు గట్టిగా చెబుతున్నా కేంద్రం (Centre )పట్టించుకోవడం లేదు. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయబోయి బొక్కా బోర్లా పడింది. పెరుగు ప్యాకెట్లతో హిందీని అంటగట్టే పన్నాగం పన్నింది. కాకపోతే అది బెడిసికొట్టింది. పెరుగు ప్యాకేట్ల పేరును దహీగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదేశించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మాకొద్దీ హిందీ అంటూ ద్రవిడ రాష్ట్రాలు గట్టిగా చెబుతున్నా కేంద్రం(Centre )పట్టించుకోవడం లేదు. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయబోయి బొక్కా బోర్లా పడింది. పెరుగు ప్యాకెట్లతో హిందీని అంటగట్టే పన్నాగం పన్నింది. కాకపోతే అది బెడిసికొట్టింది. పెరుగు ప్యాకేట్ల పేరును దహీగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదేశించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే... తమిళనాడు, కర్ణాటకలో నందిని పెరుగు ఫేమస్‌. ఆ పెరుగు ప్యాకెట్లపై హిందీ పదం దహీ (dahi)అని వాడాలని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా (FSSAI)ఆదేశించింది. కావాలనుకుంటే ప్రాంతీయ భాష పదాన్ని పక్కన బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని మెహర్బానీ చూపించింది. దహీ పదం స్పష్టంగా ముద్రిస్తూ కన్నడలో మెసరు, తమిళంలో తైర్‌ పదాలను బ్రాకెట్‌లో వాడాలని స్పష్టం చేసింది. పాల పదార్థాలైన వెన్న, జున్ను ప్యాక్‌లను కూడా హిందీలోనే పేర్కోవాలని సూచించింది. ఈ ఆదేశాలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Mk Stalin)ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీయేతర రాష్ట్రాలపై బలవంతగా హిందీ(hindi)ని రద్దడమే అవుతుందని విమర్శించారు. చివరకు పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషలో కాకుండా హిందీలో లేబుల్‌ చేయాలంటూ ఆదేశించడమంటే ఓ రకంగా హిందీని రుద్దడమేనని స్టాలిన్‌ అన్నారు. మాతృభాషలను నిర్వీర్యం, నిర్లక్ష్యం చేసేవారిని దక్షిణాది నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని సోషల్‌ మీడియా(social media)లో హెచ్చరించారు స్టాలిన్‌. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ జారీ చేసిన ఉత్తర్వును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా తప్పుపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూకేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు. తమిళనాడు(tamilnadu), కర్ణాటక(karnataka)కు చెందిన పాల(milk) ఉత్పత్తిదారులు కూడా మండిపడుతున్నారు. పెరుగును స్థానిక భాషలోనే ముద్రిస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ దహీగా హిందీలో లేబుల్స్‌పై ముద్రించబోమని అంటున్నాయి.
అసలు ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించని కేంద్ర సంస్థ వెంటనే వెనక్కి తగ్గింది. కర్డ్‌ (curd) అనే పదం ఉంటే చాలని, దహీ ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. కర్డ్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా రాయాలంటూ సన్నాయినొక్కులు నొక్కింది.

Updated On 30 March 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story