ఉదకమండలం(Udhagamandalam). వేసవిలో విడిది చేయడానికి ఇంతకు మించిన ప్లేస్‌ ఉండదు. నీలగిరి పర్వతాల అందాలు ఓ పక్క, పారే సెలయేళ్లు మరో పక్క. అందమైన తటాకాలు ఇంకో పక్క . అన్నింటికీ మించి ఆహ్లాదకరమైన వాతావరణం, వీటన్నింటికీ మించి ఇప్పుడక్కడ ఓ ఫెస్టివల్‌(festival) జరుగుతోంది.. ఆ ఉత్సవమేమిటో, దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం!
ఊటీకి వేసవిలో ఎప్పుడైనా వెళ్లవచ్చు.. కాకపోతే ఇప్పుడు వెళితే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఉదకమండలం(Udhagamandalam). వేసవిలో విడిది చేయడానికి ఇంతకు మించిన ప్లేస్‌ ఉండదు. నీలగిరి పర్వతాల అందాలు ఓ పక్క, పారే సెలయేళ్లు మరో పక్క. అందమైన తటాకాలు ఇంకో పక్క . అన్నింటికీ మించి ఆహ్లాదకరమైన వాతావరణం, వీటన్నింటికీ మించి ఇప్పుడక్కడ ఓ ఫెస్టివల్‌(festival) జరుగుతోంది.. ఆ ఉత్సవమేమిటో, దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం!
ఊటీకి వేసవిలో ఎప్పుడైనా వెళ్లవచ్చు.. కాకపోతే ఇప్పుడు వెళితే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అక్కడ అద్భుతమైన పూల ప్రదర్శన(Flowers exhibition) జరుగుతుంది. పూల ప్రదర్శన అయిన తర్వాత పండ్ల ప్రదర్శన(Fruits exhibition) కూడా ఉంటుంది. ఎండాకాలమంతా ఊటీ పర్యాటకులతో కిటకిటలాడుతూనే ఉంటుంది.. కొందరైతే వేసవి సెగలను తప్పించుకోడానికి ఓ రెండు నెలల పాటు అక్కడే హాయిగా సేదతీరుతారు. ప్రతి ఏడాది మే మాసంలో రకరకాల ఫెస్టివల్స్‌ జరుగుతాయక్కడ! ఈ సందర్భాలలో మాత్రం టూరిస్టుల తాకిడి కాసింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ వెజటబుల్‌ షో, స్పైసెస్‌ షో, రోజ్‌ షోలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఫ్లవర్‌ ఫెస్టివల్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తమిళనాడులోని(tamil nadu) Udhagamandalam(nilgiri) పర్వతాలపై ఉన్న ఉదకమండలమే షార్ట్‌ఫామ్‌లో ఊటీ. ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఇదొకటి! నీలగిరి జిల్లాకు ఇదే ప్రధాన పట్టణం కూడా! ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది కాబట్టి వేసవి విడిదిగా పేరుపొందింది. అప్పట్లో నీలగిరి పర్వత ప్రాంతం చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండింది. అటు పిమ్మట గంగ వంశ రాజుల అధీనంలోకి వచ్చింది. 12వ శతాబ్దం నాటికి హోయసాల వంశస్థుల చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్‌ పాలన కిందకు వచ్చింది నీలగిరి ప్రాంతం. టిప్పు సుల్తాన్‌ తదనంతరం బ్రిటిష్‌ పాలనలోకి వెళ్లింది.. అప్పుడు కోయంబత్తూరు ప్రావిన్స్‌కు గవర్నర్‌గా ఉన్న జాన్‌ సుల్లివాన్‌ అనే ఓ తెల్లదొరకు నీలగిరి ప్రాంతం తెగ నచ్చేసిందట! అక్కడున్న గిరిజన తెగలను నయానో భయానో లోబరుచుకుని చాలా ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. నెమ్మదిగా ఆంగ్లేయులు ఒక్కొక్కరుగా ఇక్కడకు రావడం మొదలైంది. దాంతో వేగంగా అభివృద్ధి చెందింది. మద్రాసు సంస్థానానికి సమ్మర్‌ క్యాపిటల్‌గా మారింది. రహదారులు, రైలు మార్గాలు వెలిశాయి. ఏకంగా ఓ పట్టణమే వెలిసింది. అదే ఉదకమండలం అనే ఊటీ!

సముద్రమట్టానికి రెండు వేల మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు దర్పణం. ఎటు చూసినా పచ్చదనం. ఆహ్లాదకరమైన వాతావరణం. నీలగిరి పర్వతాలు ఇంత అందంగా ఉన్నాయి కాబట్టే బ్రిటిష్‌వాళ్లు దీన్ని క్వీన్‌ ఆఫ్‌ హిల్స్‌ అన్నారు. కేవలం చల్లదనం కోసమే కాదు ఊటీ ఉన్నది. ఊటీలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. బొటానికల్‌ గార్డెన్స్‌, సరస్సులు, ప్రభుత్వ సందర్శనశాల, దొడ్డబెట్ట శిఖరం, బోట్‌హౌజ్‌, కాఫీ తోటలు, మురుగన్‌ ఆలయం, వెంకటేశ్వరస్వామి దేవాలయం ఇలా ఎన్నో ఎన్నెన్నో...! ప్రస్తుతం ఊటీలోని బొటానికల్‌ గార్డెన్‌లోనే ఫ్లవర్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. ఊటీ స్టేషన్‌ నుంచి జస్ట్‌ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది పూలవనం. రంగురంగుల పూల మొక్కలు. అరుదైన పుష్పజాతులు. పరిమళాలను వెదజల్లే విరులను ఇక్కడ తిలకించవచ్చు. ఇప్పుడీ బొటానికల్‌ గార్డెన్‌ కొత్త అందాలను సంతరించుకుంది. ఆ పూల సోయగాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. అయిదు రోజుల ఈ ఫ్లవర్‌ షోలో నాలుగు లక్షలకు పైగా పుష్పాలు కొలువు తీరనున్నాయి. వివిధ వర్ణాల పూలతో, వివిధ రకాల పూల మొక్కలతో, అరుదైన పువ్వులతో గార్డెన్‌ ఇప్పటికే అందంగా ముస్తాబయ్యింది. పూలతో రకరకాల జంతువుల ఆకారాలను తీర్చిదిద్దారు.. ఆర్కిడ్‌ పూలతో చేసిన తోరణాల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు.. పాతిక వేల రకాల పూలను కలిగిన కుండీల అలంకరణకు సెంట్‌పర్సంట్‌ మార్కులు వేయవచ్చు.

Updated On 11 May 2023 4:26 AM GMT
Ehatv

Ehatv

Next Story