ప్రేమకు ప్రతిరూపంగా, ప్రపంచపు ఎనిమిదో వింతగా చెప్పుకుంటున్న పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌పై(Taj Mahal) పడ్డారు. ఆ కట్టడాన్ని తేజో మహాలయగా(Tejo Mahalaya) అంటే శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.

యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ (Ajay Pratap Singh) ఈ దావా వేశారు. ప్రస్తుతం తాజ్‌ మహల్‌లో నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంట‌నే నిలిపివేయాలని ఆయన న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.

తాజ్‌మహల్‌గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందని పేర్కొంటూ పిటిషనర్ వివిధ చారిత్రక పుస్తకాలను కోర్టుకు నివేదించుకున్నారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌ 9వ తేదీన విచారణ జరగనుంది. ఇదిలాఉండగా తాజ్‌ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.

Updated On 28 March 2024 5:56 AM GMT
Ehatv

Ehatv

Next Story