కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో(Karnataka RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రద్దీ పెరిగింది. దీంతో బస్సుల్లో సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కొందరు మహిళలు తీవ్రంగా దాడి చేసుకున్నారు. చీరలు లాక్కొని మరీ గొడవపడ్డారు.
కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో(Karnataka RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రద్దీ పెరిగింది. దీంతో బస్సుల్లో సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కొందరు మహిళలు తీవ్రంగా దాడి చేసుకున్నారు. చీరలు లాక్కొని మరీ గొడవపడ్డారు. వారి మధ్యలో ప్రవేశించిన యువకులు కూడా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా (Viral)మారింది. కాగా.. ఇటీవల జరిగిన మరో గొడవలో బస్సు డోరును సైతం పీకేశారు. ఈ ఉచిత ప్రయాణం వల్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా.. ఈ చిల్లర ఘటనలు ఆర్టీసీకి, ప్రభుత్వానికి కళంకం తీసుకొచ్చే విధంగా ఉన్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తే .. రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మాట నిలబెట్టుకుంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం 'శక్తి యోజన' ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రారంభించారు.