ఉచిత బస్సు ప్రయాణ దూరంపై పరిమితి?
ఉచిత బస్సు పథకానికి మంగళం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తోంది. మన దగ్గర కాదు కానీ కర్ణాటక లో అయితే గ్యారంటీ కి గ్యారంటీగా స్వస్తి పలికే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దీనిపై మండిపడటం కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు శివకుమార్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే మద్దతు తెలిపారు. డీకే శివకుమార్ మంచి ఉద్దేశంతోనే చెప్పారని, గ్యారెంటీ పథకాల కోసం ఏటా రూ.65 వేల కోట్లు అవసరమవుతున్నాయని ఆయన అన్నారు. కొన్ని మంచి పథకాలు ఉన్నాయనీ, అయితే, కొన్ని ప్రాంతాల్లో ఈ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఉదాహరణకు శక్తి పథకం వల్ల కొందరు మహిళలు పదేపదే వెళ్లిన ప్రాంతాలకే మళ్లీ ప్రయాణిస్తున్నారని, ఉచితంగా ఇవ్వడం ఎంత మంచిదో అంత ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. మనకు పారదర్శకత ఉండాలని, అర్హులైన మేరకే ప్రమోజనాలు అందాలని, ఈ దిశగా ఆదేశాలు తప్పు కాదని చెప్పుకొచ్చారు. కాగా, డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినప్పటికీ దేశ్‌పాండే ఈ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ లో కాక రేపుతున్నది.
ఉచిత బస్సు ప్రయాణ దూరంపై పరిమితి?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకాన్ని సమీక్షిస్తామని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఈ పథకాన్ని సమీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా మహిళలు ఉచితంగా ప్రయాణించే దూరంపై పరిమితి విధించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, రోజువారీగా లేదా నెలవారీగా ఈ పరిమితి విధించాలా అనేది ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. ఇందుకోసం ముందుగా మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని భావిస్తున్నట్టు సమాచార