ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జిల్లాలోని మచిల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాచారమిచ్చారు. పీవోజేకే నుంచి భారత సరిహద్దు వైపు చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో భద్రతా బలగాలు వారిని హతమార్చాయి. భద్రతా బలగాలు సంబంధిత ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఘటనా స్థలంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

జూన్ 16న కూడా కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటుల యత్నాన్ని విఫలం చేశాయి భద్రతా బలగాలు. ఐదుగురు పాక్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి రాత్రిపూట జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నియంత్రణ రేఖలోని జామగుండ్ ప్రాంతంలో చొరబాటు సమాచారం మేరకు.. భద్రతా బలగాలు చాలా చోట్ల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆర్మీ అధికారి గిరీష్ కాలియా తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఐదుగురు ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. ఉగ్రవాదులను సవాలు చేయడంతో వారు కాల్పులు ప్రారంభించారు. ప్రతీకార చర్యలో ఐదుగురు ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతమయ్యారని వెల్లడించారు.