దేశంలో మళ్లీ కరోనా(Corona) కలకలం రేపుతోంది. కరోనా మనల్ని వీడిపోయిందనుకునేలోపే తిరిగి దేశంలోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది. కొత్త వేరియంట్లతో(New Varient) మళ్లీ భయపెడుతోంది. ఇప్పటికే దేశంలో కరోనాతో ఐదుగురు మృతి చెందగా..భారీగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించే(High alert) అవకాశం కనపడుతోంది.

గత రెండేళ్లుగా కరోనా లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనాతో కోలుకోని దెబ్బతిన్న ప్రజల ఉపాధి అవకాశాలు ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మళ్లీ పుంజుకునే సమయంలో మళ్లీ చేదువార్త వినిపిస్తోంది. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఐదుగురు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ(Central Health Minister) అధికారులు తెలిపారు. నూతన కరోనా వేరియంట్ జేఎన్-1(Corona JN-1) కారణంగా కేరళలో(Kerala) నలుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కు చేరింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కేసుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. తాజా కేసులతో కలిపి 4,50,04,816 కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు(Recovery Percentage) 98.91 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనాతో ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 5,33,316. మరణాల రేటు(Death Rate) 1.19 శాతంగా ఉంది.

దేశంలో మళ్లీ కరోనా కేసులు నమోదు కానుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రాలను అలర్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Updated On 18 Dec 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story