మండు వేసవిలో(Summer) ఎన్నికలు(Elections) రావడం ఇదే మొదటిసారి కాదు కానీ, ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటంతో ఓటర్లతో పాటు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు మండుతున్నాయి.

మండు వేసవిలో(Summer) ఎన్నికలు(Elections) రావడం ఇదే మొదటిసారి కాదు కానీ, ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటంతో ఓటర్లతో పాటు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. ఓటు వేయడం బాధ్యత కాబట్టి మండే ఎండను కూడా లెక్క చేయకుండా క్యూలో నిల్చొని మరీ ఓటు వేస్తున్నారు ప్రజలు. అయితే కేరళలో(Kerala) పోలింగ్‌(Polling) ప్రారంభమైన తర్వాత నలుగురు వ్యక్తులు కుప్పకూలి ప్రాణాలు విడవటం మాత్రం విషాదం.
పాలక్కాడ్‌లోని(Palakkad) ఒట్టపాలెంలో 68 ఏళ్ల ఓటరు ఓటు వేసిన తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాయి. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు చెప్పారు. అలాగే ఒట్టపాలెంలో శుక్రవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కోజికోడ్ టౌన్ బూత్ నంబర్ 16లో ఓ పార్టీ పోలింగ్‌ ఏజెంట్ 66 ఏళ్ల అనీస్ అహ్మద్ కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడు. మలప్పురం జిల్లా తిరూర్‌లో,63 ఏళ్ల మదర్సా ఉపాధ్యాయుడు ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఇక అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో 76 ఏళ్ల వృద్ధుడు ఓటేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణించాడు.

Updated On 26 April 2024 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story