కార్ పార్కింగ్‌పై(Car Parking) వివాదం చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లని(Bihar) ఔరంగాబాద్‌లో(Aurangabad) ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు తుపాకీ కాల్పులతో(Gun Firing) చనిపోయారు.
కార్ పార్కింగ్‌పై(Car Parking) వివాదం చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లని(Bihar) ఔరంగాబాద్‌లో(Aurangabad) ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు తుపాకీ కాల్పులతో(Gun Firing) చనిపోయారు. మరో ముగ్గురు ఘర్షణ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఓ దుకాణం ముందు కార్ పార్కింగ్ చేయడంతో ఈ వివాదం విషాదానికి దారి తీసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఔరంగాబాద్‌లోని నవీనగర్‌లో ఓ షాప్(Shop) ఎదుట ఓ కారు ఆగింది. దీంతో తమ షాప్ ఎదుట కార్ పార్క్ చేయడానికి వీలు లేదని ఆ షాప్ ఓనర్ కారులో ఉన్నవారికి చెప్పాడు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. అందుకు కారులో వచ్చిన వారు ఎదురుతిరిగారు. షాప్ ఓనర్‌కు, వాళ్లకు ఈ విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశంలో కారు ఓనర్ తన గన్‌తో కాల్పులు జరిపాడు. అయితే గురి తప్పి షాప్ ఓనర్ పక్కన ఉన్న వ్యక్తికి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు, షాప్ ఓనర్ కారులో వచ్చినవారిపై దాడికి దిగారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు గాయపడగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడ్డవారిని ఔరంగాబాద్‌లోని సర్దార్ ఆస్పత్రికి(Hospital) తరలించారు. ప్రస్తుతం వకిల్ అన్సారీ(Vakil Ansari) ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. అయితే అజీత్ శర్మ పరిస్థితి విషమంగా ఉంది. తుపాకీ కాల్పుల్లో మరణించిన వ్యక్తి మహువరీ గ్రామానికి చెందిన రామ్ శరణ్ చౌహాన్‌గా గుర్తించారు. కార్లో వచ్చి గొడవ పడిన నలుగురు జార్ఖండ్ పాలాము జిల్లాలోని హైదర్‌నగర్ వాసులుగా గుర్తించారు.