కర్ణాటకలోని(Karnataka) ఉడుపిలో(Udipi) దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే, దుబాయ్‌లో(Dubai) ఉద్యోగం చేస్తున్న నూర్‌ మహమ్మద్‌ భార్య హసీనా , కూతుళ్లు అఫ్నాన్‌ , అజ్నాన్‌ , కుమారులు అసాద్‌, అసీమ్‌ ఉన్నారు.

కర్ణాటకలోని(Karnataka) ఉడుపిలో(Udipi) దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే, దుబాయ్‌లో(Dubai) ఉద్యోగం చేస్తున్న నూర్‌ మహమ్మద్‌ భార్య హసీనా , కూతుళ్లు అఫ్నాన్‌ , అజ్నాన్‌ , కుమారులు అసాద్‌, అసీమ్‌ ఉన్నారు.

పెద్ద కొడుకు అసాద్‌ బెంగళూరులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో(airlines) ఉద్యోగం చేస్తున్నారు. అఫ్నాన్‌ కూడా బెంగుళూరులో ఎయిర్‌హోస్టెస్‌గా(air hostess) ఉద్యోగం చేస్తున్నారు. హసీనా, అజ్నాన్‌, అసీమ్‌లు ఉడుపిలోని తృప్తినగర్‌లో నివాసం ఉంటున్నారు. పండుగ సెలవులు రావడంతో అఫ్నాన్‌ కూడా ఉడిపిలోని నివాసానికి వచ్చారు.

ఆదివారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి ఒకరు మూతికి మాస్క్‌ పెట్టుకుని సంతెకట్టెకు వచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో తృప్తినగర్‌కు వచ్చాడు. వెంట తెచ్చుకున్న చాకుతో ఇంట్లోకి చొరబడ్డాడు. ఎక్కడ ఉన్నవారిని అక్కడే పొడిచి, గొంతుకోసం చంపేశాడు. వంటగదిలో, బెడ్‌రూమ్‌లో, బాత్‌రూమ్‌లో, హాల్‌లో ఒక్కొకరి మృతదేహలు పడి ఉన్నాయి. ఆ దుండగుడు హసీనా అత్తను కూడా వెంటాడాడు.

ఆమె భయంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో చావు నుంచి తప్పించుకోగలిగారు. హంతకుడు పావుగంటలోనే అందరినీ చంపేసి మళ్లీ ఎవరో బైక్‌లో వెళుతుంటే లిఫ్ట్‌ అడిగి సంతెకట్ట వరకు వెళ్లాడు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాడో తెలియదు. ఈ సామూహిక హత్యల విషయం నిమిషాల్లో ఉడుపి అంతటా పాకింది. వందలాది మంది ఘటనస్థలికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు.పోలీసులు కూడా వచ్చారు. ఫోరెన్సిక్‌ వాళ్లు కూడా వచ్చి ఆధారాలు సేకరించారు. అయిదు పోలీసు బృందాలు మంగళూరు, శివమొగ్గ, కారవారకు వెళ్లాయి.

రెండు బృందాలో ఉడుపిలోనే హంతకుడి కోసం గాలిస్తున్నాయి. ఆ హంతకుడి సీసీ కెమెరా ఫోటోలు, వీడియోలు పోలీసులు విడుదల చేశారు. ఇదిలా ఉంటే హంతకుడు బెంగళూరు యాసలో కన్నడ మాట్లాడినట్టు అతడిని దింపిన ఆటో డ్రైవర్‌ శ్యామ్‌ తెలిపాడు. ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తున్న అఫ్నాన్‌పై ద్వేషంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద కొడుకు పాత్రపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated On 20 Nov 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story