కర్నాటక(Karnataka) రాష్ట్రం మైసూరు(Mysore) యరగనహళ్లిలో తీవ్ర నెలకొంది. ఓ ఇంట్లో గ్యాస్‌ లీకయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కుమారస్వామి (45), భార్య మంజుల (39), పిల్లలు అర్చన (19), స్వాతి (17) ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ కుటుంబం చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణ గ్రామాని చెందినది కాగా మూడేళ్ల నుంచి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రజక వృత్తితో జీవనం సాగిస్తున్నారు.

అయితే ఈ కుటుంబం నివసిస్తున్న ఇల్లు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంది. 10*20 చదరపు అడుగులో విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటికి ముందు, వెనుక ఒక్కో కిటికీ ఉంది. సొంతూర్లో పెళ్లి ఉంటే అక్కడికి వెళ్లి వచ్చి కిటికీలు మూసి నిద్రకు ఉపక్రమించారు. ప్రయాణం చేసిన అలిసిపోయి గాఢ నిద్రలో మునిగిపోయారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ఓ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ అయింది. కానీ గ్యాస్‌(LPG gas) బయటకు వెళ్లేందుకు ఎక్కడా గ్యాప్‌ లేకపోవడంతో ఆ గ్యాస్‌ పీల్చి స్పృహ తప్పిపోయారు. కొన్ని గంటల తరువాత ప్రాణాలు వదిలారు. మృతుల చెవులు, ముక్కుల నుంచి రక్తం కారింది. 12 గంటల పాటు వారు ఆ ఇంటిలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. సోమవారం రాత్రి వచ్చి పడుకున్న వారు మంగళవారం ఉదయం చనిపోయినట్లు భావిస్తున్నారు. అయితే కుమారస్వామికి బంధువులు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా కానీ లిఫ్ట్‌ చేయడం లేదు. చుట్టుపక్కలవారికి సమాచారాన్ని బంధువులు తెలిపారు. దీంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమివ్వగా.. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా భయానకవాతావరణ నెలకొని ఉంది. ఇంట్లో మూడు సిలిండర్లు ఉండగా రెండు ఖాళీగా ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఘటనాస్థలికి వచ్చారు. గ్యాస్ ఎలా లీకైంది, ఎవరైనా కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Updated On 23 May 2024 3:42 AM GMT
Ehatv

Ehatv

Next Story