మాల్దీవులా? లక్షద్వీపమా? అన్నది తర్వాత ముందు మణిపూర్(Manipur) మంటలను చల్లార్చండి మహాప్రభో అని వేడుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఎనిమిది నెలలుగా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా బిష్ణుపూర్(Bishnupur) జిల్లాలో మళ్లీ కాల్పులు(Shoot Out) జరిగాయి.
మాల్దీవులా? లక్షద్వీపమా? అన్నది తర్వాత ముందు మణిపూర్(Manipur) మంటలను చల్లార్చండి మహాప్రభో అని వేడుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఎనిమిది నెలలుగా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా బిష్ణుపూర్(Bishnupur) జిల్లాలో మళ్లీ కాల్పులు(Shoot Out) జరిగాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం తీయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి(Cumbi), తౌబల్(Taubal) జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఈ సంఘటన అనంతరం కుంబి పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. కొత్త సంవత్సరం రోజున తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగింది. ఈ ఘర్షణల్లో నలుగురు చనిపోయారు. జనవరి 2వ తేదీన గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయితీ, కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 180 మందికిపైగా చనిపోయారు.