భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ(Rajiv gandhi) హత్య కేసులో నిందితుడైన సుతేంద్రరాజా(Sutendra Raja) చెన్నైలో(chennai) మృతి చెందాడు. ఈరోజు తెల్లవారుజామున 7:50 నిమిషాలకు అతనికి గుండెపోటు(Heart attack) వచ్చినట్లు ఆస్పత్రి డీన్ డాక్టర్ వీ తేరనిరాజన్ తెలిపారు. కాలేయం దెబ్బతినడంతో చికిత్స కోసం అతను ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు వెల్లడించారు. సుతేంద్రరాజా అలియస్ శంతన్(shantan) రాజీవ్ హత్య కేసులో జైలు నుంచి రిలీజైన ఏడు మంది ముద్దాయిల్లో ఇతను ఒకడు.
భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ(Rajiv gandhi) హత్య కేసులో నిందితుడైన సుతేంద్రరాజా(Sutendra Raja) చెన్నైలో(chennai) మృతి చెందాడు. ఈరోజు తెల్లవారుజామున 7:50 నిమిషాలకు అతనికి గుండెపోటు(Heart attack) వచ్చినట్లు ఆస్పత్రి డీన్ డాక్టర్ వీ తేరనిరాజన్ తెలిపారు. కాలేయం దెబ్బతినడంతో చికిత్స కోసం అతను ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు వెల్లడించారు. సుతేంద్రరాజా అలియస్ శంతన్(shantan) రాజీవ్ హత్య కేసులో జైలు నుంచి రిలీజైన ఏడు మంది ముద్దాయిల్లో ఇతను ఒకడు. శ్రీలంక జాతీయుడైన శంతన్.. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
అయితే రాజీవ్ హత్య కేసులో సంతన్‌కు ఉరి శిక్ష పడింది. 1999లో సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. ఇతనితో పాటు మురుగన్, పెరారివాలన్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది. రాజీవ్ హత్య కేసులో ఈ నిందితులు ముగ్గరికీ క్షమాభిక్ష పెట్టారు. దీంతో సుతేంద్రరాజా నవంబర్ 2022లో జైలు నుంచి బయటకు వచ్చాడు. 1991లో జరిగిన రాజీవ్ హత్య కేసులో.. తమిళ టైగర్స్‌కు సుతేంద్రరాజా ఇంటెలిజెన్స్ సభ్యుడిగా చేసినట్లు తెలుస్తోంది. క్షమాభిక్షతో సాధారణ జీవితం గడుపుతున్న సుతేంద్ర అనారోగ్యంతో మృతి చెందాడు.