P. Chidambaram : ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవ సంబరాలపై చిదంబరం విమర్శలు
బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా స్వేచ్ఛను అణిచివేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం(P.Chidhambaram) ఆదివారం ఆరోపించారు. ఆర్టికల్ 370(Article 370) రద్దుతో జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని ప్రభుత్వం చెబుతోందని ఆయన అన్నారు. భారతదేశం అంతటా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అణచివేయబడిందన్నారు.
బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా స్వేచ్ఛను అణిచివేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం(P.Chidambaram) ఆదివారం ఆరోపించారు. ఆర్టికల్ 370(Article 370) రద్దుతో జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని ప్రభుత్వం చెబుతోందని ఆయన అన్నారు. భారతదేశం అంతటా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అణచివేయబడిందన్నారు.
ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవం సందర్భంగా.. చారిత్రాత్మక నిర్ణయం జమ్మూ కాశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి నాంది పలికిందని ప్రభుత్వం శనివారం హైలైట్ చేసింది. ఆర్టికల్‌ను రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని సామాన్య ప్రజలు తమ ఇష్టానుసారం జీవించడమే అతిపెద్ద మార్పు అని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) మనోజ్ సిన్హా శ్రీనగర్‌లో అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో (ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం) శాంతి నెలకొందని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సంబరాలు చేసుకుంటున్నారని చిదంబరం అన్నారు. జమ్మూకశ్మీర్‌లో అంత శాంతి ఉంటే మెహబూబా ముఫ్తీని ప్రభుత్వం ఎందుకు గృహనిర్భంధంలో ఉంచిందని ప్రశ్నించారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP), నేషనల్ కాన్ఫరెన్స్ కార్యాలయాలకు ఎందుకు సీలు వేశారు? అని ప్రశ్నించారు. దేశం అంతటా స్వేచ్ఛను అణచివేస్తున్నారని.. జమ్మూ కాశ్మీర్‌లో అత్యంత తీవ్రమైన అణచివేత జరిగిందని ఆరోపించారు.
శనివారం శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆర్టికల్ 370 రద్దు నాలుగో వార్షికోత్సవాన్ని బీజేపీ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆగస్టు 5, 2019 నిర్ణయం తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అపూర్వమైన స్థిరత్వం నెలకొందని అన్నారు. మూడు దశాబ్దాల అల్లకల్లోలం తర్వాత ఈ ప్రాంతంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. రాష్ట్రం స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలు మూడేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు.