సెక్స్ స్కాండల్ కేసులో(sex scandal case) చిక్కుకుని అరెస్ట్ భయంతో విదేశాలకు పారిపోయిన జేడీ(ఎస్) నాయకుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) రేపు ఇండియాకు రానున్నాడు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(Dev Gowd) మనవడు అయిన ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం ఆరోపణలు రావడంతో ఏప్రిల్ 26వ తేదీన దేశం విడిచిపెట్టి దౌత్య పాస్‌పోర్ట్‌తో విదేశాలకు పారిపోయాడు.

Prajwal Revanna
సెక్స్ స్కాండల్ కేసులో(sex scandal case) చిక్కుకుని అరెస్ట్ భయంతో విదేశాలకు పారిపోయిన జేడీ(ఎస్) నాయకుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) రేపు ఇండియాకు రానున్నాడు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(Dev Gowd) మనవడు అయిన ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం ఆరోపణలు రావడంతో ఏప్రిల్ 26వ తేదీన దేశం విడిచిపెట్టి దౌత్య పాస్‌పోర్ట్‌తో విదేశాలకు పారిపోయాడు. మే 31వ తేదీన జరిగే విచారణకు తాను తప్పకుండా హాజరవుతానని చెబుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశాడు ప్రజ్వల్. ఈ నేపథ్యంలోనే మే 30వ తేదీన జర్మనీలోని మ్యూనిచ్ నుంచి భారత్‌కు బయలుదేరనున్నాడు. మే 31వ తేదీ ఉదయం పది గంటలకు సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రజ్వల్ కోసం నిఘా ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ దిగగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
