దివంగత మాజీ ప్రధానమంత్రి ఛౌదురీ చరణ్‌సింగ్‌కు(Chowdhury Charan Singh) కేంద్రప్రభుత్వం భారతరత్న(Bharat ratna) పురస్కారంతో గౌరవించింది. అందరూ ఆయనను పదవీలాలసుడని అనుకుంటారు. ఇది అర్థసత్యమే. అధికారం కోసం ఆయన మొండిపట్టుపట్డడం నిజం. పార్టీ మారడానికి, చీల్చడానికి వెనుకాడరన్నది కూడా నిజమే! కానీ ఆయన అవినీతిపరుడు మాత్రం కాదు. అవినీతిని అసలు సహించేవారు కాదు. రైతు బాంధవుడు. గ్రామీణ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు.

దివంగత మాజీ ప్రధానమంత్రి ఛౌదురీ చరణ్‌సింగ్‌కు(Chowdhury Charan Singh) కేంద్రప్రభుత్వం భారతరత్న(Bharat ratna) పురస్కారంతో గౌరవించింది. అందరూ ఆయనను పదవీలాలసుడని అనుకుంటారు. ఇది అర్థసత్యమే. అధికారం కోసం ఆయన మొండిపట్టుపట్డడం నిజం. పార్టీ మారడానికి, చీల్చడానికి వెనుకాడరన్నది కూడా నిజమే! కానీ ఆయన అవినీతిపరుడు మాత్రం కాదు. అవినీతిని అసలు సహించేవారు కాదు. రైతు బాంధవుడు. గ్రామీణ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు. అత్యంత విప్లవాత్మక భూ సంస్కరణ చట్టాలను రూపొందించారు. వాటిని అమలు చేశారు. నగరీకరణ తగ్గి, గ్రామాలు, పట్టణాలు స్వయంసమృద్ధి సాధించాలనే ఆకాంక్ష కలిగినవారు. మతఛాందసత్వం లేనివారు. నెహ్రూ(Nehru) అంటే ఇష్టమే అయినా కొన్ని విధానాలను, సహకార వ్యవసాయం వంటి ఆలోచనలను బహిరంగంగానే ప్రతిఘటించారు. ప్రతీ సమస్యను కులమనే కోణంలో చూసేవారు.

బ్రాహ్మణులు, ఠాకూర్లు, బనియాలే పదవులన్నీ అనుభవిస్తున్నారని, తనలాంటి జాట్‌ కులస్తులను సరైన కోణంలో మీడియా చూపడం లేదని అనేవారు. ఆయన సొంతంగా దుర్మార్గాలను ప్రోత్సహించక పోయినా, ఆయన అనుయాయులు తమ నియోజకవర్గాలలో దళితులను ఓట్లేయనీయకపోవడం వలన దళితులకు ఈయన దూరమయ్యారు. ఆనాటి మీడియా ఈయనను కులక్‌ నాయకుడు అనేది. జనతా పార్టీ విజయానికి చరణ్‌సింగ్‌ ఎంత కారకులో, వైఫల్యానికి కూడా అంతే కారకులు. ఉపప్రధానిగా ఉంటూనే ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌తో ఎడమొగం, పెడమొగంగా వుండేవారు. ఆయనలో లోపాలు ఎన్నిఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హర్యానాలలో ఆయన కొంతకాలం పాటు బలమైన శక్తిగా వెలిగారు.

చరణ్‌సింగ్‌ మీరట్‌ జిల్లాలోని సూర్‌పూర్‌ గ్రామంలో 1902లో జన్మించారు. పుట్టింది సాధారణ రైతు కుటుంబంలో! సైన్సులో డిగ్రీ చేసిన తర్ఆత ఆగ్రా యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యువేషన్‌ చేశారు. తర్వాత న్యాయ విద్యను అభ్యసించారు. ఘజియాబాద్‌లో ప్రాక్టీస్‌ కూడా పుట్టారు. 1929లో మీరట్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 1937లో ఉత్తరప్రదేశ్‌ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే తర్వాత వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. 1946 గోవింద వల్లభ్‌ పంత్‌ ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. 1951లో మంత్రి అయ్యారు. డాక్టర్‌ సంపూర్ణానంద్‌, సీబీ గుప్తా, సుచేత కృపలానీల క్యాబినెట్లలో అనేక శాఖలలో మంత్రిగా పని చేశారు. 1967 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ దెబ్బ తింది. 425 స్థానాలలో కాంగ్రెస్‌కు వచ్చినవి 199 స్థానాలు మాత్రమే. గత ఎన్నికలకంటే 74 సీట్లు తగ్గాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ సీట్లు చాలవు. జనసంఘ్‌కు 98 స్థానాలు వచ్చాయి.

సోషలిస్టులు (ఎస్‌ఎస్‌పి) 44 స్థానాల్లో గెలిచారు. కమ్యూనిస్టులకు 15 సీట్లు లభించాయి. 37 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌(Congress) వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూనుకున్నాయి. కాకపోతే జన్‌సంఘ్‌తో కమ్యూనిస్టులు ఎలా కలవడం? ఈ తర్జనభర్జనలో ఉన్నప్పుడే బీహార్‌లో మహామాయ ప్రసాద్‌ సిన్హా విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూసి ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) కూడా అలాంటి ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు కలవరం కలిగించింది. ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. కాకపోతే అందరిని కలుపుకునిపోగల సమర్థుడు, సీనియర్‌ నాయకుడు కమలాపతి త్రిపాఠి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన స్థానంలో కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా సీబీ గుప్తా, చరణ్‌సింగ్‌ పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలించి చివరకు గుప్తాను ఎంపిక చేసింది.

దీంతో చరణ్‌సింగ్‌ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ బాధతోనే మంత్రివర్గంలో చేరడానికి నిరాకరించారు. ఆయనే కాదు, ఆయన అనుచరులు కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. దీంతో పక్షం రోజుల్లోనే గుప్తా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి చరణ్‌సింగ్‌ జన కాంగ్రెస్‌ అనే కొత్త పార్టీ పెట్టారు. ప్రతిపక్షాలతో చేతులు కలిసి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో 18 రోజులకే సీబీ గుప్తా ప్రభుత్వం పడిపోయింది. చరణ్‌ సింగ్‌ తన పార్టీ పేరు భారతీయ క్రాంతి దళ్‌గా మార్చారు. క్రాంతి అంటే విప్లవమని చెప్పుకునేవారు. 1967 ఏప్రిల్‌లో జనసంఘ్‌, ఎస్‌ఎస్‌పి, పిఎస్‌పి, స్వతంత్ర, కమ్యూనిస్టులు, రిపబ్లికన్‌ పార్టీ, ఇండిపెండెంట్లతో కలిసి సంయుక్త విధాయక దళ్‌ పేరిట మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అందరూ ఒప్పుకున్న 19 పాయింట్లతో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం తయారుచేసుకున్నారు. ఇందులో సమస్తాన్ని చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు కూడా ఈ పాయింట్లలో ఉంది.

సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తూనే చరణ్‌సింగ్‌ కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం ఆచరణలో అసాధ్యమని తేల్చేశారు. చరణ్‌సింగ్‌ ప్రభుత్వం కూడా సజావుగా సాగలేదు. వ్యవసాయంపై పన్ను తీసేయాలంటూ రామ్‌ మనోహర్‌ లోహియా ప్రభుత్వంనుంచి తప్పుకుంటానని చెప్పారు. విభేదాలు పెరిగాయి. నాలుగు నెలల్లోనే చరణ్‌సింగ్‌ రాజీనామా చేశారు. దాంతో భాగస్వాములకు భయం పట్టుకుంది. తమ పదవులు కూడా పోతాయని తెలుసుకుని రాజీకొచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగలేదు. చివరకు 1968 ఫిబ్రవరిలో చరణ్‌సింగ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది.

1969లో ఎన్నికలు వచ్చాయి. ప్రతిపక్షాల తీరును చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు మెజారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు 211 స్థానాలు లభించాయి. జనసంఘ్‌కు 49 సీట్లు, ఎస్‌ఎస్‌పికి(SSP) 33 స్థానాలు, సిపిఐకు 80 స్థానాలు, చరణ్‌ బికెడికి 98 సీట్లు వచ్చాయి. కాంగ్రెసు నాయకుడు సీబీ గుప్తా 1970 ఫిబ్రవరిలో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అక్టోబరు దాకా పాలించి అంతర్గత కలహాలతో దిగిపోయారు. అధికారం దక్కితే చాలు, శత్రువుల సాయం కూడా తీసుకోవడానికి వెనుకాడని చరణ్‌సింగ్‌ కాంగ్రెసు మద్దతు తీసుకుని 1970 ఫిబ్రవరిలో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎనిమిది నెలల పాటు ఆ పదవిలో ఉన్నారు. అదీ కుప్పకూలడంతో 17 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ కాంగ్రెసు పార్టీ నాయకుడైన త్రిభువన నారాయణ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రిగా తెచ్చారు.

ఆయన 1970 అక్టోబరు నుంచి 1971 ఏప్రిల్‌ దాకా సీఎంగా ఉండి గొడవల వల్ల గద్దె దిగారు. దాంతో కమలాపతి త్రిపాఠీకి అధికారం అప్పగించాల్సి వచ్చింది. పాపం ఆయన కూడా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి పదవిలో లేరు. 1973 జూన్‌లో ఆయన దిగాల్సి వచ్చింది. దాదాపు అయిదు నెలలు రాష్ట్రపతి పాలన విధించి, 1973 నవంబరులో ఎచ్‌.ఎన్‌.బహుగుణను ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. బహుగుణ నాలుగు నెలలు సీఎంగా ఉన్న తర్వాత 1974లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దానిలో కాంగ్రెసుకు 215, జనసంఘ్‌కు 61, సిపిఐకు 16 రాగా బికెడికి 106 వచ్చాయి. బహుగుణ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎం పదవిలో ఉండగానే ఎమర్జన్సీ వచ్చింది. మధ్యలో జరిగిన 1971 పార్లమెంటు ఎన్నికలలో బికెడికి 2.18 శాతం ఓట్లతో ఒక్క లోక్‌సభ సీటు దక్కింది.

ఈ అనుభవాలతో చరణ్‌ సింగ్‌ తన పార్టీలోకి ఇతర పార్టీలను కూడా ఆహ్వానించారు. స్వతంత్ర పార్టీని, కాంగ్రెసు పార్టీలో నాయకుడిగా దశాబ్దాలపాటు వెలిగి, 1969లో బయటకు వచ్చేసిన బిజూ పట్నాయక్‌ (ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తండ్రి) పెట్టిన ఉత్కళ కాంగ్రెసును, సోషలిస్టు పార్టీని కలుపుకుని 1974 చివర్లో భారతీయ లోక్‌ దళ్‌ పార్టీగా ఏర్పరచాడు. ఎమర్జన్సీ విధించేనాటికి చరణ్‌ సింగ్‌ పార్టీ మరీ బలమైన నాయకుడేమీ కాదు, అలాటిది 1977 వచ్చేసరికి అతను అతి ముఖ్య నాయకుడై పోయి, ప్రధాని ఎవరో నిర్ణయించగల ఉపప్రధాని అయ్యారు. చరణ్‌సింగ్‌ను రాజ్‌నారాయణ్‌ చెయిర్‌ సింగ్‌ అని విమర్శించేవారు.

అలాంటి చరణ్‌సింగ్‌తోనే రాజ్‌నారాయణ్‌(Raj narayan) చేతులు కలిపారు. ఆయన స్థాపించిన భారతీయ క్రాంతిదళ్‌లో 1974-77 వరకు వున్నాడు. 1977లో అది జనతా పార్టీలో విలీనమైంది. రెండేళ్లు తిరక్కుండా చరణ్‌ సింగ్‌, రాజ్‌ నారాయణ్‌ ఇత్యాదులు జనతా పార్టీ (సెక్యులర్‌) పేర దాన్ని చీల్చి రెండేళ్లు పార్టీ నడిపారు. రాజ్‌నారాయణ్‌ ఉచ్చులో పడి జనతాసర్కార్‌ నుంచి బయటకు వచ్చారు చరణ్‌సింగ్‌. తర్వాత కాంగ్రెస్‌ సహకారంతో ప్రధానమంత్రి అయ్యారు. ఆరు నెలలు తిరక్కుండానే కాంగ్రస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 1987 మే 28న చరణ్‌సింగ్‌ కన్నుమూశారు. తు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. ఆయన జయంతి అయిన డిసెంబరు 23వ తేదీని కిసాన్ దివస్ గా జరుపుకుంటారు.

Updated On 9 Feb 2024 7:33 AM GMT
Ehatv

Ehatv

Next Story