కర్ణాటక( మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) తీవ్ర జ్వరంతో(Fever) బుధవారం ఉదయం బెంగుళూరు నగరంలోని అపోలో ఆస్పత్రిలో(Apollo Hospital) చేరారు. ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. హెచ్‌డి కుమారస్వామి ఆసుపత్రిలో చేరడంతో ఇవాళ కోలార్ పర్యటన(Kolar Tour) రద్దయింది.
కర్ణాటక(karntaka) మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) తీవ్ర జ్వరంతో(Fever) బుధవారం ఉదయం బెంగుళూరు నగరంలోని అపోలో ఆస్పత్రిలో(Apollo Hospital) చేరారు. ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. హెచ్‌డి కుమారస్వామి ఆసుపత్రిలో చేరడంతో ఇవాళ కోలార్ పర్యటన(Kolar Tour) రద్దయింది. కోలారులోని శ్రీనివాసపూర్‌లో అటవీశాఖ ఆక్రమణల తొలగింపు సందర్భంగా.. పంటలు నష్టపోయిన రైతుల భూములను పరిశీలించేందుకు కుమారస్వామి వెళ్లాల్సివుంది.
ఈ రోజు తెల్లవారుజామున ఆరోగ్యం స్వల్పంగా క్షీణించడంతో అపోలో ఆసుపత్రిలో చేరిన హెచ్‌డి కుమారస్వామి.. ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నారు. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం కోలుకున్న తర్వాత విడుదల చేయనున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది. జ్వరం, అలసటతో పాటు ఆరోగ్యంలో హెచ్చుతగ్గుల కారణంగా ఈరోజు తెల్లవారుజామున 3.40 గంటలకు హెచ్‌డి కుమారస్వామి ఆసుపత్రిలో చేరారని వెల్లడించింది.
సీనియర్ ఆసుపత్రి వైద్యుల బృందం కుమారస్వామికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుమారస్వామి కోలుకుంటున్నారు. వచ్చే 48 గంటల పాటు హెచ్‌డికె ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.