కర్ణాటక ఎన్నికల(karnataka Elections)కు మహా అయితే మరో మూడు వారాల సమయమే ఉంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహరచన చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో టికెట్లు దొరకని నేతలు తమ అధిష్టానాలపై ఆగ్రహంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ(BJP)కి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్(Karnataka Former CM Jagadish Shettar) కూడా అధినాయకత్వంపై ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరిపోయారు. నిన్న ఉదయం ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా
కర్ణాటక ఎన్నికల(karnataka Elections)కు మహా అయితే మరో మూడు వారాల సమయమే ఉంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహరచన చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో టికెట్లు దొరకని నేతలు తమ అధిష్టానాలపై ఆగ్రహంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ(BJP)కి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్(Karnataka Former CM Jagadish Shettar) కూడా అధినాయకత్వంపై ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరిపోయారు. నిన్న ఉదయం ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన షెట్టర్ తర్వాత బీజేపీలో టికెట్ దొరకని ఆశావహులు, అనుచరులతో కలిసి బెంగళూరు(Bengaluru)కు వెళ్లారు. కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన రెండు విమానాల్లో వీరు హుబ్బళ్లి నుంచి బెంగళూరు(Hubli to Bangalore)కు చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా(Randeep Singh Surjewala), కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(Karnataka Pradesh Congress Chief DK Shivakumar) , మాజీ మంత్రి ఎంబీ పాటిల్(MB Patil)తో సమావేశమయ్యారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ' ఓ సీనియర్ నేతగా నాకు టికెట్ వస్తుందనే అనుకున్నా. కానీ అలా జరగలేదు. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయంపై నాతో ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు' అని జగదీశ్ షెట్టర్ మీడియాకు చెప్పారు. 'షెట్టర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సత్తా ఉన్న నాయకుడు. ఆయన ఒంటరిగా గెలవడమే కాదు, చాలామందిని గెలిపించగలరు కూడా' అని మల్లికార్జున ఖర్గే అన్నారు.
మలికార్జున ఖర్గే చెప్పినట్టుగా ఓ పాతిక స్థానాలలో జగదీశ్ షెట్టర్ ప్రభావం చూపించగలరు. కొత్తవారికి అవకాశం ఇస్తున్నామనే కారణం చెప్పి షెట్టర్‌కు మొండిచేయి చూపించింది అధిష్టానం. సహజంగానే ఇది షెట్టర్‌కు కోపం తెప్పించింది. అవమానంగా ఫీలయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విరుచుకుపడ్డారు. యడియూరప్ప(Yediyurappa)తర్వాత అంతటి సీనియారిటీ ఉన్న తనను ఇంతగా అవమానిస్తారా అని ఆగ్రహించారు. రాష్ట్రనేతల కారణంగా అధిష్ఠానం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. లింగాయత్ సామాజిక వర్గంలో కీలక నేత అయిన షెట్టర్ బీజేపీ అధినాయకత్వానికి హెచ్చరికలు కూడా పంపించారు. షెట్టర్‌కు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటక(Uttara Karnataka)లోని చాలా నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని హైకమాండ్‌కు కూడా తెలిపిరు. తనకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీ 20 నుంచి 25 స్థానాలు కోల్పోయే ఛాన్సుందని, రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని జగదీశ్ షెట్టర్ అన్నారు. పార్టీ వదిలి వెళ్లకుండా ఉండేందుకు జగదీశ్‌ను చాలా మంది బుజ్జగించారు. కేంద్ర మంత్రులు ధర్మేంద ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైలు చాలా చెప్పి చూశారు కానీ షెట్టర్ వినిపించుకోలేదు. అసలే సర్వేలన్నీ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో షెట్టర్‌లాంటి బలమైన నేత కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకు గట్టి దెబ్బే!