Vaishnava Temples : భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవ ఆలయాలు
వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) పండుగ సందర్భంగా వైష్ణవ ఆలయాలు(Vaishanav Temples) కొత్త కళను సంతరించుకున్నాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో(Shuklapaksham) వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి(Ekadashi) రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారన్నది పురాణ కథనం. ఈ రోజుల ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శిస్తే మహాపుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) పండుగ సందర్భంగా వైష్ణవ ఆలయాలు(Vaishanav Temples) కొత్త కళను సంతరించుకున్నాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో(Shuklapaksham) వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి(Ekadashi) రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారన్నది పురాణ కథనం. ఈ రోజుల ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శిస్తే మహాపుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తెల్లవారుజాము నుంచే క్యూలు కట్టారు భక్తులు. తిరుమలలో(tirumala) శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana), హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ(Hima Kohli), జస్టిస్ ఎస్.ఎల్. భట్టి(SL Nhatti), జస్టిస్ శ్యామ్ సుందర్(Shyam sundhar), జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, ఉపసభాపతి వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చన్నాయుడు ఉన్నారు. ఇక తెలంగాణలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు కూడా భక్తులు పోటెత్తారు. ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజ గోపురం చెంత నరసింహస్వామి మహా విష్ణు రూపంలో భక్త జనానికి దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులతో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వేకువజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు.