భారత రాజకీయవేత్త, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navajyoth singh siddu) భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
భారత రాజకీయవేత్త, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navajyoth singh siddu) భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వైద్యులు చేతులెత్తేసి ఆమె బతికే అవకాశం లేదని ప్రకటించారు. కానీ ఆమె 40 రోజుల్లో ఆమెను కోలుకుంది. ఈ చికిత్సకు ఎక్కువ ఖర్చు కూడా కాలేదు. సిద్ధూ 1988లో జరిగిన రోడ్ రేజ్ డెత్ కేసులో 2022లో ఒక సంవత్సరం శిక్షను అనుభవించారు. అతని భార్య నవజోత్ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. జైలులో ఉండగా సిద్దుకు విషయం చెప్పలేదు. కీమోథెరపీ ఎంత ఖరీదైనదో మనందరికీ తెలుసు. ఖరీదైన చికిత్సలు ఉన్నప్పటికీ క్యాన్సర్ తరచుగా రోజులు, నెలలు లేదా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది.
నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్ 4 క్యాన్సర్‌ను ఎలా గెలిచిందంటే..!
ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు ప్రకటించిన తర్వాత, నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య కఠినమైన ఆహార నియమాలను పాటించారు. ఇంట్లో సులభంగా లభించే వస్తువులతో క్యాన్సర్‌ను జయించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ మొదట తన భార్య భోజనంలో చక్కెర, కార్బోహైడ్రేట్‌లు లేకుండా చేశారు. ఆహారం, ఆహారం మధ్య చాలా గ్యాప్‌లు ఇచ్చారు. ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడుతుందని సిద్దూ చెప్పాడు. మరొక ముఖ్యమైన అంశం అడపాదడపా ఉపవాసం. సూర్యాస్తమయానికి ముందే రోజు చివరి భోజనం చేసేవారు. తదుపరి భోజనం దాదాపు 15-15.5 గంటల తర్వాత తింటారు, అంటే మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తినేవారు.
నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఉదయం నిమ్మ రసం సేవించేవారు. దాదాపు అరగంట తర్వాత, ఆమె 10-12 వేప ఆకులను తినేవారు. ఈ దినచర్యను పాటించడం ప్రారంభించిన తర్వాత తన భార్య తన స్టేజ్ 4 క్యాన్సర్ నుండి కోలుకోవడానికి 40 రోజులు మాత్రమే పట్టిందని భారత మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. బరువుకు కారణమయ్యే ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో ఈ నియమాలు సహాయపడ్డాయని.. అంతేకాకుండా 25 కిలోల బరువు తగ్గిందని అన్నారు. కొబ్బరి పాలు తన భార్య కోలుకోవడానికి నిజంగా సహాయపడిందని కూడా అతను పంచుకున్నాడు. కొబ్బరి పాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. నవజ్యోత్ కౌర్ సిద్ధూకు ఇప్పుడు క్యాన్సర్ పూర్తిగా నయమైందన్నారు. తాము చెప్పిన ఆహార నియమాలు పాటించడంతో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఎవరికైనా ఉపయోగపడుతుందని సిద్ధూ తెలిపాడు.