భారత మాజీ కెప్టెన్ MS ధోని(MS dhoni) 2007 T20 ప్రపంచ కప్‌లో(World cup) ఫైనల్ ఓవర్ హీరో 'జోగిందర్ శర్మ'(Joginder sharma) ను కలిశాడు.
భారత మాజీ కెప్టెన్ MS ధోని(MS dhoni) 2007 T20 ప్రపంచ కప్‌లో(World cup) ఫైనల్ ఓవర్ హీరో 'జోగిందర్ శర్మ'(Joginder sharma) ను కలిశాడు. జోగిందర్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనిని కలిసిన ఫోటోను పంచుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత ధోనిని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జోగిందర్ "చాలా కాలం తర్వాత ధోనిని కలవడం ఆనందంగా ఉంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడం ఈ రోజు ఎంతో సరదాగా ఉంది."అని పోస్టులో చెప్పుకొచ్చాడు.
2007లో భారతదేశం T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో ధోని కెప్టెన్సీ కూడా కీలక పాత్రను పోషించింది. పాకిస్థాన్ తో ఫైనల్ లో జోగిందర్ శర్మ చివరి ఓవర్ వేశాడు. జోహన్నెస్‌బర్గ్‌లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ లో ధోని జోగిందర్ శర్మకు బంతిని ఇచ్చి సాహసోపేతమైన, అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. మిస్బా-ఉల్-హక్ క్రీజులో ఉండడంతో పాకిస్థాన్ విజయానికి చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉంది. అనుభవజ్ఞుడైన బౌలర్‌ను ఎంచుకోవడానికి బదులుగా, ధోని జోగిందర్ శర్మకు బాధ్యతను అప్పగించాడు. అయితే జోగిందర్ శర్మ అద్భుతంగా బౌలింగ్ వేసి మిస్బా ఉల్ హక్ వికెట్ తీశాడు.. 5 పరుగులతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోరు. ఇక జోగిందర్ శర్మ క్రికెట్ కెరీర్ కొన్ని కారణాల వలన కొనసాగిపోయినా.. పోలీసు విభాగంలో ఉన్నాడు.