2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections)కు ముందు అధికార బీజేపీకి గట్టి షాక్ తగలనుంది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్(Jagadish Shettar) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. షెట్టర్ ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీకి చేరుకుని అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి(Vishveshwar Hegde Kageri)కి తన రాజీనామా లేఖను అందజేశారు.
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections)కు ముందు అధికార బీజేపీకి గట్టి షాక్ తగలనుంది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్(Jagadish Shettar) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. షెట్టర్ ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీకి చేరుకుని అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి(Vishveshwar Hegde Kageri)కి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం బీజేపీకి కూడా రాజీనామా చేస్తానన్నారు. తన తదుపరి కార్యాచరణ గురించి ఆదివారం విలేకరులతో మాట్లాడిన శెట్టర్.. ఇప్పుడు తనకు అన్ని దార్లు తెరిచి ఉన్నాయని పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరే విషయమై శెట్టర్ ప్రస్తుతం తన శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నారు. షెట్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు తనను సంప్రదించలేదని, అయితే కాంగ్రెస్(Congress)లో చేరడంపై తన సన్నిహితులతో చర్చిస్తానని చెప్పారు.
ఈ విషయంపై మీరు ప్రధాని నరేంద్ర మోదీని సంప్రదిస్తారా అని అడగ్గా షెట్టర్ బదులిస్తూ.. ప్రధాని మోదీ(Nrendra Modi)ని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah)ను సంప్రదించడానికి ఎటువంటి ప్రయత్నం చేయనని చెప్పారు. ప్రధానిగా, కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఏం జరుగుతుందో వారికే తెలియాలన్నారు. పార్టీని నిర్మించిన సీనియర్లను ఉద్దేశ్యపూర్వకంగా కించపరుస్తున్నారని శెట్టర్ అన్నారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుంది. రాష్ట్రంలో కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకున్నారు. పెద్దలతో మాట్లాడే మర్యాద వారికి లేదు. లింగాయత్ నాయకత్వాన్ని బీజేపీ నాశనం చేస్తోందని శెట్టర్ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ బలి అవుతోందని అన్నారు.
శెట్టర్ హుబ్బల్లి-ధార్వాడ్ (సెంట్రల్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల అథని నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ నిరాకరించడంతో లక్ష్మణ్ సవాడి(Laxman Savadi) కాంగ్రెస్‌లో చేరి అదే నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న అనుభవజ్ఞుడైన జగదీష్ షెట్టర్‌ను తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.