బ్రిటన్‌(Britain) మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌(Boris Johnson) మళ్లీ తండ్రి కాబోతున్నాడు. అదీ 58 ఏళ్ల వయసులో.. అది కూడా ఎనిమిదో బిడ్డకు..! ఈ విషయాన్ని జాన్సన్‌ భార్య క్యారీ సిమండ్స్‌(Carrie Simmonds) తెలిపింది. మరికొన్ని వారాల్లో తమ ఫ్యామిలీలోకి మరో వ్యక్తి రాబోతున్నాడంటూ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు.

బ్రిటన్‌(Britain) మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌(Boris Johnson) మళ్లీ తండ్రి కాబోతున్నాడు. అదీ 58 ఏళ్ల వయసులో.. అది కూడా ఎనిమిదో బిడ్డకు..! ఈ విషయాన్ని జాన్సన్‌ భార్య క్యారీ సిమండ్స్‌(Carrie Simmonds) తెలిపింది. మరికొన్ని వారాల్లో తమ ఫ్యామిలీలోకి మరో వ్యక్తి రాబోతున్నాడంటూ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ఎనిమిదో బిడ్డ అంటున్నారు.. మళ్లీ ఇద్దరు పిల్లలంటున్నారు.. అంతా కన్‌ఫ్యూషన్‌గా ఉంది కదూ! వివరంగా చెప్పుకుందాం! 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్‌ జాన్సన్‌ కొన్నేళ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత 2021 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. వీరికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 ఏప్రిల్‌లో విల్ఫ్‌ పుడితే, 2021 డిసెంబర్‌లో రోమీ జన్మించాడు. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నది. క్యారీ కంటే ముందు బోరిస్‌ రెండు పెళ్లిళ్లు చేసుకుననారు. మొదట 1987లో ఆర్టిస్టు, జర్నలిస్టు అయిన అలెగ్రా మోస్టిన్‌ ఓవెన్‌ను(Allegra Mostyn Owen) పెళ్లి చేసుకున్నారు బోరిస్‌. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. అటు పిమ్మట 1993లో భారత సంతతికి చెందిన జర్నలిస్ట్‌ మెరీనా వీలర్‌ను(Marina Wheeler) వివాహం చేసుకున్నారు. పాతికేళ్ల పాటు వీరి దాంపత్యం కొనసాగింది. వీరి దాంపత్యానికి రుజువుగా నలుగురు పిల్లలు పుట్టారు. 2018లో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2020 విడాకులు మంజూరయ్యాయి. బీబీసీ వార్త సంస్థ చెబుతున్నదాని ప్రకారం ఆర్ట్‌ కన్సల్టెంట్‌ హెలెన్‌ మాకిన్‌టైర్‌తో బోరిస్‌ జాన్సన్‌కు సంబంధం ఉందట. వీరిద్దరికి ఓ కొడుకు కూడా పుట్టాడట!

Updated On 20 May 2023 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story