బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం తెల్లవారుజామున జైలు నుంచి బయటకు వచ్చారు. 1994లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో దోషిగా తేలి.. ఈ కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఆయన విడుదలను సులభతరం చేసేందుకు జైలు నిబంధనలను సవరించింది. ఏప్రిల్ 24 సాయంత్రం 27 మంది ఖైదీల పేర్లతో సహా ఆనంద్ మోహన్‌ను విడుదల చేసేందుకు బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్(Anand Mohan) గురువారం తెల్లవారుజామున జైలు నుంచి బయటకు వచ్చారు. 1994లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య(Krishnaiah) హత్యకేసులో దోషిగా తేలి.. ఈ కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. నితీష్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం ఏప్రిల్ 10న ఆయన విడుదలను సులభతరం చేసేందుకు జైలు నిబంధనలను సవరించింది. ఏప్రిల్ 24 సాయంత్రం 27 మంది ఖైదీల పేర్లతో సహా ఆనంద్ మోహన్‌ను విడుదల చేసేందుకు బీహార్ ప్రభుత్వం(Bihar Govt) అధికారికంగా నోటిఫికేషన్(notification) జారీ చేసింది.
పెరోల్‌పై బయటకు వచ్చి సోమవారం (ఏప్రిల్ 24) పాట్నాలో జరిగిన తన కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఆనంద్ మోహన్.. ఆ సమయంలోనే తాను విడుదలైన వార్తను తెలుసుకున్నాడు. దాదాపు 30 ఏళ్ల నాటి హత్యకేసులో ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యాడని ఫంక్షన్ లో ఉండగా సమాచారం అందింది.
ఆనంద్ మోహన్‌ను విడిపించేందుకు జైలు నిబంధనలను సవరించిన నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంపై .. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం "తీవ్రమైన దిగ్భ్రాంతి" వ్యక్తం చేసింది, ఇది "న్యాయ నిరాకరణతో సమానం" అని పేర్కొంది. ఇండియన్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (సెంట్రల్) అసోసియేషన్ బీహార్ ప్రభుత్వ చర్య "ప్రభుత్వ సేవకుల ధైర్యాన్ని క్షీణింపజేస్తుందని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.
ఖైదీల వర్గీకరణ నిబంధనలను మార్చడం ద్వారా గోపాల్‌గంజ్(Gopalgunj) మాజీ జిల్లా మేజిస్ట్రేట్, ఐఎఎస్ అధికారి జి కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన దోషులను విడుదల చేయాలనే బీహార్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సెంట్రల్ ఐఎఎస్ అసోసియేషన్(Central IAS Association) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
1994లో ఆనంద్ మోహన్ సింగ్(Anand Mohan Singh చేతిలో హత్యకు గురైన అప్పటి గోపాల్‌గంజ్ డీఎం (బీహార్) జి కృష్ణయ్య భార్య ఉమాదేవి(Uma Devi).. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి (President), ప్రధాని మోదీకి(Narendra Modi) విజ్ఞప్తి చేశారు. ఆనంద్ మోహన్‌ను తిరిగి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఆయన విడుదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామన్నారు. ఆయనను విడుదల చేయడం తప్పుడు నిర్ణయమన్నారు. సీఎం ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని సూచించారు. ఆనంద్ మోహన్ ను బహిష్కరించండి. ఆయన్ని తిరిగి జైలుకు పంపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఉమాదేవి అన్నారు. కృష్ణయ్య కుమార్తె పద్మ(Padma) కూడా ఆనంద్ మోహన్ విడుదలపై తన నిరాశను వ్యక్తం చేసింది.
14 ఏళ్లకు పైగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న 26 మందితో పాటు బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఏప్రిల్ 10న బీహార్ ప్రభుత్వం మోహన్ విడుదలను సులభతరం చేయడానికి.. రూల్ 481కి మార్పులు చేస్తూ.. ప్రిజన్ మాన్యువల్ 2012ను సవరించింది. 14 నుంచి 20 ఏళ్ల మధ్య జైలు శిక్ష అనుభవించిన మరో 26 మంది ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
జి కృష్ణయ్య.. తెలంగాణలో(Telangana)ని మహబూబ్‌నగర్(Mahbubnagar)కు చెందినవారు. ఆయన పేద దళిత కుటుంబానికి చెందినవారు. ఆ సమయంలో అత్యంత నిజాయితీగల ఐఏఎస్(IAS) అధికారులలో ఒకరిగా గుర్తింపు ఉండుది. ఆనంద్ మోహన్ నేతృత్వంలోని గుంపు దాడి చేయడంతో 1994లో మరణించారు.