చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో తన ఖరీదైన ఫోన్ నీటిలో పడిపోయిందని ఓ అధికారి ఏకంగా రిజర్వాయర్‌నే తోడించి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే! దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన కాంకేర్ జిల్లా(Kanker District)లో జరిగింది. ఇప్పటికే నీటిని తోడించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్(Food inspector Rajesh Vishwas)ను సస్పెండ్ చేశారు.
చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో తన ఖరీదైన ఫోన్ నీటిలో పడిపోయిందని ఓ అధికారి ఏకంగా రిజర్వాయర్‌నే తోడించి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే! దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన కాంకేర్ జిల్లా(Kanker District)లో జరిగింది. ఇప్పటికే నీటిని తోడించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్(Food inspector Rajesh Vishwas)ను సస్పెండ్ చేశారు. అందుకు అనుమతించిన ఇంద్రావతి ప్రాజెక్టు(Indravati Dam) సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్.కె. ధివర్‌కు ప్రభుత్వం జరిమానా విధించింది. నీటిని వృదా చేసినందుకు 53 వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. డ్యామ్‌లోని అయిదు అడుగుల వరకు నీటిని తోడేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి 42 లక్షల లీటర్ల నీటిని వృధా చేసినందుకు ఆ నీటికి అయ్యే ఖర్చును జీతం నుంచి ఎందుకు రికవరీ చేయకూడదో చెప్పాలంటూ ధివర్‌కు ఓ లేఖ కూడా రాశారు.
వేసవిలో సాగు నీరు, ఇతర అవకాశాల కోసం రిజర్వాయర్లలో నీరు చాలా అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాజేశ్ విశ్వాస్ మాత్రం తానేమీ తప్పు చేయలేదంటున్నాడు. తన ఫోన్‌లో అధికారిక డిపార్ట్‌మెంట్ డేటా ఉన్నందున ఆ ఫోన్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నించానని, ఆ నీరు నిరుపయోగంగానే ఉందని వాదిస్తున్నాడు. కాంకేర్ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న రాజేశ్ వీకెండ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఖేర్‌కట్టా డ్యామ్ దగ్గర స్నానం చేయడానికి వెళ్లాడు. సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమావశాత్తూ ఫోన్ డ్యామ్ నీటిలో పడింది. స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు కానీ దొరకలేదు. కంగారు పడ్డ రాజేశ్ ఎస్‌డీఓకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాడు. ఆయన ఓకే అన్న తర్వాతే ముందుకెళ్లానని రాజేశ్ అంటున్నాడు. కేవలం మూడు లేదా నాలుగు అడుగుల నీటి తోడించేందుకు మాత్రమే అంగీకరించానని చెప్పాడు. 30 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపులతో నీటిని తోడారు. మూడు రోజుల పాటు తోడుతూనే ఉన్నారు. 41 లక్షల లీటర్ల నీటిని బయటకు తోడితే కానీ ఫోన్ కనిపించలేదు.