మానవ అక్రమ రవాణా అనుమానంతో నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విమానం 276 మంది ప్రయాణికులతో ముంబైకి చేరుకుంది.

మానవ అక్రమ రవాణా(Human Trafficking) అనుమానంతో నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌(France)లో నిలిపివేసిన విమానం 276 మంది ప్రయాణికులతో ముంబై(Mumbai)కి చేరుకుంది. ఈ మేర‌కు 276 మంది ప్రయాణికులతో విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైకి చేరుకుందని అధికారులు సమాచారం ఇచ్చారు. ఎయిర్‌బస్ ఏ340(Airbus A340) తెల్లవారుజామున 4 గంటలకు ముంబైలో ల్యాండ్ అయిందని అధికారి తెలిపారు. పారిస్‌లోని విట్రీ విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:30 గంటలకు విమానం బయలుదేరింది.

ఫ్రెంచ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి బయలుదేరే సమయంలో విమానంలో 276 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఇద్దరు మైనర్లతో సహా 25 మంది ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యక్తులు ఫ్రాన్స్‌లో ఉన్నారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఫ్రెంచ్ న్యూస్ ఛానల్ తెలిపింది. తర్వాత వారిని విడుదల చేశారు. వత్రి విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు విమానంలో 303 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారని.. వీరిలో 11 మంది మైనర్లు ఉన్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు.

మానవ అక్రమ రవాణా అనుమానంతో 303 మంది ప్రయాణికులతో దుబాయ్ నుండి నికరాగ్వా వెళ్లే విమానం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ఆపివేయబడింది. ఫ్రెంచ్ మీడియా ప్రకారం.. కొంతమంది ప్రయాణికులు హిందీ.. మరికొందరు తమిళం మాట్లాడుతున్నారు. అయితే, విమానయాన సంస్థ తరపు న్యాయవాది స్మగ్లింగ్‌లో ఎలాంటి ప్రమేయం లేదని ఖండించారు. ఫ్రాన్స్‌లో మానవ అక్రమ రవాణాకు 20 సంవత్సరాల వరకు శిక్ష విధించే నిబంధన ఉంది.

Updated On 25 Dec 2023 9:08 PM GMT
Yagnik

Yagnik

Next Story