☰
✕
గ్రీష్మ రుతువులో ఎండలు భయంకరంగా ఉంటాయంటారు పెద్దలు. దేశరాజధాని ఢిల్లీలో (Delhi) ఎండలు అలాగే ఉన్నాయి.
x
గ్రీష్మ రుతువులో ఎండలు భయంకరంగా ఉంటాయంటారు పెద్దలు. దేశరాజధాని ఢిల్లీలో (Delhi)
ఎండలు అలాగే ఉన్నాయి. సూర్యుడు మండిపోతున్నాడు. ఫలితంగా అసాధారణ ఉష్ణోగ్రతలు(Temperature) నమోదవుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. వీటికి తోడు నీటి కటకట ఢిల్లీ ప్రజలకు నరకం చూపిస్తున్నది. వడగాలులకు(Heatwaves) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ ఎన్‌సిఆర్ పరిధిలో గత 72 గంటలలో 15 మంది వడదెబ్బతో చనిపోయారు. ఢిల్లీలో అయిదుగురు, నోయిడాలో పది మంది మరణించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 12 మంది వెంటిలేటర్ సపోర్ట్‌తో చికత్స పొందుతున్నారు. వడదెబ్బ కేసులలో మరణాల రేటు సుమారు 60 నుంచి 70 శాతం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడినవారిలో ఎక్కువ మంది వలస కూలీలే ఉన్నారు. 60 ఏళ్లు పైపడిన వారే అధికంగా ఉన్నారు.
Eha Tv
Next Story