బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ప్రయత్నించి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పెను విషాదం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో చోటు చేసుకుంది. బయోగ్యాస్‌ పిట్‌లో పిల్లి పడింది. దాన్ని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలో దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు బావిలో దిగారు. అది బయోగ్యాస్‌ పిట్‌ అని పాపం వారికి తెలియదు కాబోలు.

బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ప్రయత్నించి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పెను విషాదం మహారాష్ట్ర(Maharashtra)లోని అహ్మద్‌నగర్‌(Ahmednagar)లో చోటు చేసుకుంది. బయోగ్యాస్‌ పిట్‌లో పిల్లి పడింది. దాన్ని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలో దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు బావిలో దిగారు. అది బయోగ్యాస్‌ పిట్‌ అని పాపం వారికి తెలియదు కాబోలు. ఈ ఆరుగురిలో అయిదుగురు ఊపిరి ఆడక చనిపయారు. చనిపోయిన అయిదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్‌ బావిలోంచి బయటకు తీసుకొచ్చింది. నడుముకు తాడు కట్టుకుని బావిలో దిగిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని, అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అధికారి ధనంజయ్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లుగా గుర్తించారు. బావి లోపలికి దిగిన తర్వాత ఊపిరాడక వారు కేకలు పెట్టారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Updated On 10 April 2024 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story