2023లో భారత్‌లో టాప్‌ యూట్యూబ్‌(Top Youtube channels 2023) బ్రేక్‌ ఔట్లను ప్రకటించింది. యూట్యూబ్‌ చానెళ్ల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఫిట్‌నెస్(Fitness), బాడీ బిల్డింగ్‌(Body building), వంటల ప్రోగ్రామ్‌(Cooking program), జీవనశైలి వరకు అనేక యూట్యూబ్‌ చానెల్స్ ఉన్నాయి. యూట్యూబ్‌ ప్రకటించిన టాప్‌ బ్రేక్‌ ఔట్‌ ఏంటో చూద్దాం..

2023లో భారత్‌లో టాప్‌ యూట్యూబ్‌(Top Youtube channels 2023) బ్రేక్‌ ఔట్లను ప్రకటించింది. యూట్యూబ్‌ చానెళ్ల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఫిట్‌నెస్(Fitness), బాడీ బిల్డింగ్‌(Body building), వంటల ప్రోగ్రామ్‌(Cooking program), జీవనశైలి వరకు అనేక యూట్యూబ్‌ చానెల్స్ ఉన్నాయి. యూట్యూబ్‌ ప్రకటించిన టాప్‌ బ్రేక్‌ ఔట్‌ ఏంటో చూద్దాం...

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పవన్‌ సాహూ(Pawan Sahu) టాప్‌1 నిలిచారు. లైఫ్‌స్టైల్‌ బ్లాగర్ నీతూ బిష్త్ రెండో స్థానంలో నిలిచారు. ఇతర చానెల్స్ “క్యూట్.శివాని.05”, “అమన్ రియల్ డ్యాన్సర్”, షింటు మౌర్య, సాగర్ కిచెన్, ప్రియా బిస్వాస్, ప్రశాంత్ శర్మ ఎంటర్‌టైన్‌మెంట్, గ్రేట్ ఇండియన్ ASMR ఉన్నాయి.

పవన్‌ సాహు.. ఫిట్‌నెస్ ట్రైనర్‌(Fitness Trainer).. ఇతను ఈ ఏడాది 22 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకున్నాడు. నాలుగేళ్ల క్రితం యూట్యూబ్‌ చానెల్‌ను ప్రారంభించిన పవన్‌ సాహు ఆ సమయంలో తొలి వీడియో విడుదల చేశాడు. బైక్‌ను భుజం మీద మోస్తూ సిట్-అప్‌ చేయడం, వ్యాయామం చేసే వీడియోలను తన చానెల్‌లో పోస్ట్ చేసి లక్షల వ్యూస్‌ను సంపాదించుకున్నాడు. ఈ ఏడాది భారత్ యూట్యూబ్‌ చానెల్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లను పొందిన పవన్‌సాహు చానెల్‌ టాప్‌లో నిలిచింది.

నీతు బిష్త్(Neethu Bisht)..!
ఇక టాప్‌2లో నీతు బిష్త్ చానెల్‌ ఉంది. ఈ లైఫ్‌స్టైల్‌ బ్లాగర్‌.. ఫన్నీ వీడియోలను, కంటెంట్‌ను రూపొందించే లైఫ్‌స్టైల్ బ్లాగర్. ఈ చానెల్‌ 20.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను పొందారు. మరో కంటెంట్ క్రియేటర్‌ లఖన్ అర్జున్ రావత్‌ను నీతు బిష్త్‌ వివాహం చేసుకుంది.

శివాని.05
మరో యూట్యూబర్‌ శివాని.05 షార్ట్‌లలో పలు ఫన్నీ వీడియోలు చేయడంలో పేరుగావించింది. శివాని వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 14.3 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది.

ఫిల్మీ సూరజ్‌

ఫిల్మీ సూరజ్‌ కూడా టాప్‌ 10లో నిలిచాడు. తన నటనా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ చేసే వీడియోలు, ఫన్నీ వీడియోలు తన చానెల్‌లో షేర్‌ చేస్తూ 14.4 మిలియన్ల మంది సభ్యులను పొందాడు.

అమన్ డ్యాన్సర్ రియల్

మరో యూట్యూబర్ అమన్‌ డ్యాన్సర్‌.. ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్‌ వేస్తూ యూట్యూబ్‌లో పోస్టులు చేయడంతో 11 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందాడు.

ప్రశాంత్ శర్మ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్‌లో ఫన్నీ, ఎమోషనల్‌ వీడియోలు పోస్టూ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చానెల్ 10.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను పెట్టుకుంది.

ప్రియా బిస్వాస్.. ఈమె రకరకాల వీడియోలను తన చానెల్‌లో పోస్టు చేస్తోంది. యూట్యూబ్‌లో 9.07 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది.

Great Indian Asmr..
గ్రేట్‌ ఇండియన్‌ ఏఎస్‌ఎంఆర్ ఈ ఛానెల్ 9.7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది.‘కుర్కురే చికెన్’, ‘పుచ్చకాయ మిల్క్‌షేక్’ వంటి ప్రత్యేకమైన వంటకాలను చూపించే వీడియోలకు బాగా వ్యూస్‌ లభించాయి.

Artist Shintu Mourya

ఆర్టిస్ట్ షింటు మౌర్య.. ఈ ప్రతిభావంతుడైన కళాకారుడు యూట్యూబ్‌లో 8.38 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించాడు, తన సృజనాత్మకతను వీడియోలలో ప్రదర్శిస్తూ వచ్చాడు. దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా కాగితాన్ని కత్తెరతో కత్తిరించడం నుంచి అరటిపండ్లు కోసి హనుమంతుని చిత్రపటాన్ని రూపొందించడం వరకు.. అతను వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో తన బహుముఖ ప్రజ్ఞను చూపించాడు.

Sagar’s Kitchen

సాగర్స్‌ కిచెన్.. ఇది వంటకు సంబంధించిన చానెల్. 7.61 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను పొందింది. 'లిట్టి చోఖా', 'బేక్డ్ చీజ్ టొమాటో', 'గోభి మంచూరియన్', 'పావ్ బజ్జీ' వరకు వివిధ వంటకాల వీడియోలను తన వంట చానెల్‌లో ప్రసారం చేసిం

Updated On 19 Dec 2023 5:54 AM GMT
Ehatv

Ehatv

Next Story