సిద్ధరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరి ప్రమాణ స్వీకారం నిమిత్తం 16వ కర్ణాటక శాసనసభ మొదటి సెషన్ సోమవారం ప్రారంభమైంది. అసెంబ్లీ అధికారుల ప్రకారం
సిద్ధరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరి ప్రమాణ స్వీకారం నిమిత్తం 16వ కర్ణాటక శాసనసభ మొదటి సెషన్ సోమవారం ప్రారంభమైంది. అసెంబ్లీ అధికారుల ప్రకారం.. మూడు రోజుల సెషన్‌లో కొత్తగా ఎన్నికైన మొత్తం 224 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సమయంలోనే కొత్త స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది.
కర్నాటక అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే(RV Deshpande) వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK shiva kummar), మంత్రులు జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే తదితరులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అంతకుముందు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో ఆయన బంధువైన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. శివకుమార్ అసెంబ్లీ మెట్ల వద్ద కూడా వంగి నమస్కరించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కూడా కలిశారు.