మధ్యప్రదేశ్(Madhya Pradesh) ఉజ్జయిని మహాకాళేశ్వరు(Ujjain Mahakaleshwar)ని గర్భగుడిలో అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. సోమవారం ఉదయం భస్మ హారతి(Bhasma Aarti) సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో పూజారితో పాటు 13 మందికి గాయాలయ్యాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆలయంలో వేలాది మంది భక్తులు ఉన్నారు.
మధ్యప్రదేశ్(Madhya Pradesh) ఉజ్జయిని మహాకాళేశ్వరు(Ujjain Mahakaleshwar)ని గర్భగుడిలో అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. సోమవారం ఉదయం భస్మ హారతి(Bhasma Aarti) సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో పూజారితో పాటు 13 మందికి గాయాలయ్యాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆలయంలో వేలాది మంది భక్తులు ఉన్నారు. హోలీ వేడుకల(Holi Celebrations)ను చూడటానికి వారంతా ఆలయానికి వచ్చారు. మహాకాళేశ్వరుడికి హారతి ఇస్తున్న సమయంలో పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాల్ చల్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న భక్తులు అగ్నిమాపక సిబ్బందికి చెప్పారు. వారు వెంటనే ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి ఇస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు.