వందే భారత్ రైలు(Vande Bharat Train)కు పెను ప్రమాదం తప్పింది. భోపాల్ నుంచి ఢిల్లీ(Bhopal to Delhi)కి వెళుతున్న వందే భారత్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం ఉదయం కుర్వాయి స్టేషన్ దగ్గర జరిగింది. రాణి కమలాపాఠి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్ దగ్గర రైలులోని సీ -14 కోచ్‌లో మంటలు వ్యాపించాయి.
వందే భారత్ రైలు(Vande Bharat Train)కు పెను ప్రమాదం తప్పింది. భోపాల్ నుంచి ఢిల్లీ(Bhopal to Delhi)కి వెళుతున్న వందే భారత్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం ఉదయం కుర్వాయి స్టేషన్ దగ్గర జరిగింది. రాణి కమలాపాఠి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్ దగ్గర రైలులోని సీ -14 కోచ్‌లో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దాంతో రైలును అక్కడే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఫైర్ ఇంజన్లు ఘటనస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.40 గంటలకు మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి బయలుదేరి ఢిల్లీ లోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ కు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు..