బేసిన్ బ్రిడ్జి సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోచ్‌లలో నుంచి ప్రయాణీకులు భయంతో బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 6 గంటలకు చెన్నై నుండి ముంబైకి బయలుదేరిన లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో.. సాయంత్రం 6.48 గంటలకు చెన్నై బేసిన్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే రైలు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
చెన్నై బేసిన్ బ్రిడ్జి(Chennai Basin Bridge) సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్(Lokmanya Tilak Express) లో మంటలు(Fire Break) చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు(Passengers) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోచ్‌ల(Coaches)లో నుంచి ప్రయాణీకులు భయంతో బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 6 గంటలకు చెన్నై(Chennai) నుండి ముంబై(Mumbai)కి బయలుదేరిన లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో.. సాయంత్రం 6.48 గంటలకు చెన్నై బేసిన్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే రైలు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకో పైలెట్(Loco Pilot) అప్రమత్తమై వెంటనే రైలును ఆపేశాడు.
వెంటనే రైల్వే పోలీసులకు(Poice), అగ్నిమాపక సిబ్బంది(Fire Department)కి సమాచారం అందించగా.. వారు వచ్చి గంటపాటు శ్రమించి ప్రయాణికుల కంపార్ట్‌మెంట్లకు మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు. ఆ తర్వాత రీప్లేస్‌మెంట్ ఇంజన్(Replacement Engine)ను అమర్చి రైలు అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధం చేశారు. హైవోల్టేజీ(High Voltage) విద్యుత్ లైన్(Electric Line)పై రాపిడి కారణంగా ఇంజన్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే, ఖచ్చితమైన కారణం తెలియదు. విచారణ సాగుతోంది.