కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డిపార్చర్ సెక్షన్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక్క‌సారిగా బలమైన మంటలు ఎగసిపడ్డాయి. అధికారులు వెంట‌నే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

కోల్‌కతా(Kolkata)లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్(Netaji Subhash Chandrabose) అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport)లోని డిపార్చర్ సెక్షన్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. ఆ సమయంలో ఒక్క‌సారిగా బలమైన మంటలు ఎగసిపడ్డాయి. అధికారులు వెంట‌నే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం మూడు అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. సమాచారం ప్రకారం.. డిపార్చర్ లాంజ్‌(Departure Lounge)లోని డి పోర్టల్ ప్రాంతంలో రాత్రి 9.10 గంటలకు మంటలు చెలరేగాయి. డీ పోర్టల్ అనేది ప్రయాణీకులు బోర్డింగ్ పాస్‌(Boarding Pass)లను పొందే ప్రదేశం. మొదట మంటలను ఆర్పడానికి విమానాశ్రయం లోపల అంతర్నిర్మిత అగ్నిమాపక వ్యవస్థను ఉపయోగించారు. కానీ తరువాత అగ్నిమాపక సిబ్బందిని పిలిచారు. షార్ట్‌సర్క్యూట్(Short Circuit) కార‌ణంగా మంటలు చెలరేగి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణం విచారణ తర్వాత తేలనుంది. ప్ర‌మాదంపై బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదు.

Updated On 14 Jun 2023 8:50 PM GMT
Yagnik

Yagnik

Next Story