ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన(Happiest country) దేశంగా ఫిన్‌ల్యాండ్‌(Finland) నిలిచింది. ఫిన్‌ల్యాండ్‌కు వరుసగా ఏడో సారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, ఆస్ట్రేలియా వరుసగా టాప్‌-9లో నిలిచాయి.

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన(Happiest country) దేశంగా ఫిన్‌ల్యాండ్‌(Finland) నిలిచింది. ఫిన్‌ల్యాండ్‌కు వరుసగా ఏడో సారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, ఆస్ట్రేలియా వరుసగా టాప్‌-9లో నిలిచాయి. తాజా అధ్యయనం ప్రకారం ఈ జాబితాను విడుదల చేశారు. అన్ని దేశాలకంటే చిట్టచివరన ఆఫ్గనిస్తాన్‌(Afghanistan) నిలిచింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో 143వ స్థానంలో నిలిచింది ఆఫ్గనిస్తాన్. యూకే 20, అమెరికా-23, జర్మనీ-24, చైనా-64, రష్యా-70 స్థానంలో నిలిచాయి. అయితే భారత్‌ మాత్రం పాకిస్తాన్‌ కంటే పడిపోవడం గమనార్హం. పాకిస్తాన్‌కు 108వ స్థానం దక్కితే భారత్‌ 126వ స్థానంలో నిలిచింది.

Updated On 20 March 2024 3:03 AM GMT
Ehatv

Ehatv

Next Story